Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking NewsTOP STORIES

Ration Cards : తెలంగాణ ప్రజలకు సర్కార్ బిగ్ షాక్.. వారి రేషన్ కార్డులన్నీ రద్దు..!

Ration Cards : తెలంగాణ ప్రజలకు సర్కార్ బిగ్ షాక్.. వారి రేషన్ కార్డులన్నీ రద్దు..!

మన సాక్షి, తెలంగాణ బ్యూరో :

తెలంగాణ ప్రభుత్వం వచ్చేనెల (అక్టోబర్) మాసంలో కొత్త రేషన్ కార్డులు ఇచ్చేందుకు ఒ పక్క ప్రణాళికలు రూపొందించగా మరోవైపు రేషన్ కార్డులను రద్దు చేయాలని నిర్ణయించి ప్రజలకు బిగ్ షాక్ ఇచ్చింది. రాష్ట్రవ్యాప్తంగా 15 లక్షల తెల్ల రేషన్ కార్డులు రద్దు చేయనున్నట్లు తెలుస్తుంది. రేషన్ కార్డులు రద్దు చేసిన తర్వాతనే కొత్త రేషన్ కార్డుల జారీ ప్రక్రియ మొదలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.

తెలంగాణ రాష్ట్రంలో మొత్తం జనాభా 3.83 కోట్లు ఉంది. కాగా 89.96 లక్షల తెల్ల రేషన్ కార్డులు ఉన్నాయి. కాగా కొత్తగా రేషన్ కార్డులు మంజూరు చేయక చాలా కాలమైనందున లక్షలాదిమంది రేషన్ కార్డుల కోసం ఎదురుచూస్తున్నారు. అందుకు గాను తెలంగాణ ప్రభుత్వం అక్టోబర్ నుంచి కొత్త రేషన్ కార్డులకు దరఖాస్తుల స్వీకరణ చేపట్టనున్నారు. 10 సంవత్సరాల కాలంగా అర్హులకు రేషన్ కార్డులు అందకపోవడం వల్ల దరఖాస్తులు భారీగా వచ్చే అవకాశం ఉంది.

కాగా ప్రస్తుతం ఉన్న రేషన్ కార్డులలో సుమారు 15 లక్షల మంది రేషన్ కార్డులను ప్రభుత్వం రద్దు చేసే అవకాశం ఉంది. అనర్హులకు కూడా తెల్ల రేషన్ కార్డులు ఉన్నాయనే ఆరోపణలు రావడం వల్ల రేషన్ కార్డులకు ఈ కేవైసీ ప్రక్రియను ప్రభుత్వం ప్రారంభించింది. 2023 అక్టోబర్ మాసంలో ఈకేవైసీ విధానాన్ని అమలు చేసింది. దాంతో రేషన్ కార్డులో ఉన్న వారంతా ఆయా రేషన్ దుకాణాల వద్ద వేలిముద్రలు వేసి నిర్ధారణ చేసుకోవలసిన అవసరం ఉంది.

కాగా ఈ కేవైసీ గడువు ఈ ఏడాది మార్చి నెలతో ముగిసింది. అప్పటికే ప్రభుత్వం ఆరు పర్యాయాలు ఈ కేవైసీ గడువును పెంచుతూ వచ్చింది. కాగా 2024 మార్చి నెలాఖరుతో ఈ కేవైసీ గడు ముగిసింది. అయినా కూడా రాష్ట్రవ్యాప్తంగా 15 లక్షల మంది ఈ కేవైసీ చేసుకోలేదు. దాంతో ఈ కేవైసీ చేసుకొని వారు వివిధ కారణాలవల్ల రేషన్ కార్డులను తీసుకోదల్చుకోలేదని ప్రభుత్వం భావిస్తుంది.

అందుకుగాను 15 లక్షల రేషన్ కార్డులను ప్రభుత్వం రద్దు చేయాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఈ కేవైసీ చేసుకోని కార్డులను రద్దు చేసిన తర్వాతనే నూతన కార్డులను జారీ చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం.

LATEST UPDATE : 

 

మరిన్ని వార్తలు