మోడల్ స్కూల్ విద్యార్థులను నడి రోడ్డుపై వదిలేసిన ఆర్టీసీ బస్సు డ్రైవర్..!
మోడల్ స్కూల్ విద్యార్థులను నడి రోడ్డుపై వదిలేసిన ఆర్టీసీ బస్సు డ్రైవర్..!
నడిగూడెం, మన సాక్షి :
సూర్యాపేట జిల్లా నడిగూడెం మండలంలోని రామాపురం, చాకిరాల, ఎక్లాస్ ఖాన్ పేట, చాకిరాల,తో పాటు మండలం లోని వివిధ గ్రామాల నుండి మండలం లోని కరివిరాల గ్రామం లోని మోడల్ స్కూల్ కు వెళ్లే విద్యార్థుల రవాణా కోసం ఆర్టీసీ బస్ సౌకర్యం కలిపించారు.
గురువారం ప్రతి రోజు లాగే గ్రామాలకు వచ్చిన ఆర్టీసీ బస్ విద్యార్థుల ను ఎక్కించుకొని నడిగూడెం నుండి చాకిరాల వెళ్లే ప్రధాన రహదారి పై గుంత ఏర్పడి ఇబ్బందిగా ఉన్నది సాయంత్రం బస్సు మీ గ్రామానికి రాదు మీరు ఇక్కడ దిగాలని బస్సు కండక్టర్డ్ చెప్పారు.
డ్రైవర్ బస్సు గుంత దాటిన తరువాత విద్యార్థుల ను తీసుకొని వెళ్లకుండా ఊరుకి దూరం గా నడి రోడ్డు పై దింపి వేసి వెళ్లడం తో ఏమి చేయాలో, ఎటు వెళ్లాలో తెలియక అయోమయం లో ఉన్న విద్యార్థుల ను మండలం లోని శ్రీ సాయి పబ్లిక్ స్కూల్ లో ఉపాధ్యాయుడు రోడ్డు పై ఉన్న విద్యార్థుల ను చూసి వారితో మాట్లాడి వారి పాఠశాల బస్ లో విద్యార్థుల ను వారి ఇంటికి సురక్షితం గా పంపించారు.
విషయం తెలుసుకున్న విద్యార్థుల తల్లిదండ్రులు మా పిల్లలను నడిరోడ్డు పై వదిలి వెళ్లిన బస్సు డ్రైవర్, కండక్టర్ పై చర్యలు తీసుకొవాలని వారు కోరారు.
LATEST UPDATE :
-
TG News : చెరువులోనే మూడంతస్తుల భవనం.. బాంబులతో పేల్చివేసిన అధికారులు.. (వీడియో)
-
TG News : పేద ప్రజలకు సీఎం రేవంత్ అదిరిపోయే శుభవార్త.. ఇందిరమ్మ ఇళ్లకు ప్రణాళికలు..!
-
Nalgonda : నల్గొండ జిల్లాలో సంచలనం.. ప్రేమించిన యువతి పెళ్లి చేసుకోమన్నందుకు అత్యాచారం, హత్య..!
-
Nalgonda : జిల్లా కలెక్టర్ సస్పెండ్ చేసిన ఎంపీడీవో, గ్రామ కార్యదర్శులను విధుల్లోకి తీసుకోవాలి.. లేదంటే ముమ్మడి సెలవులంటూ హెచ్చరిక..!









