Breaking Newsక్రైంజిల్లా వార్తలుతెలంగాణనల్గొండసూర్యాపేట జిల్లా

రైతుబందు కుంభకోణం.. తహసిల్దార్ అరెస్టు..!

రైతుబందు కుంభకోణం.. తహసిల్దార్ అరెస్టు..!

మన సాక్షి :

భూమి లేకున్నా.. పట్టాదారు పాస్ పుస్తకాలను సృష్టించి రైతుబంధు పేరుతో డబ్బులు స్వాహా చేసిన తహసిల్దార్. ఈ సంఘటన సూర్యాపేట జిల్లాలో చోటుచేసుకుంది. ఈ కుంభకోణంలో నల్గొండ జిల్లా అనుముల మండల తాసిల్దార్ జయశ్రీని పోలీసులు అరెస్టు చేశారు.

వివరాల ప్రకారం.. సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ లో రైతుబంధు కుంభకోణం వెలుగు చూసింది. ధరణి ఆపరేటర్ జగదీష్ తో కలిసి తాసిల్దార్ జయశ్రీ భారీ కుంభకోణానికి పాల్పడింది. పోలీసులు వారి ని ఇరువురిని అరెస్టు చేసినట్లు సమాచారం. వారికి 14 రోజుల రిమాండ్ విధించారు.

ఆమె గతంలో హుజూర్ నగర్ తాసిల్దార్ గా పని చేసిన సమయంలో హుజూర్ నగర్ బూరుగడ్డ రెవిన్యూ పరిధిలో 36. 23 ఎకరాల ధరణి పట్టాదార్ పాస్ బుక్ పుస్తకాలు సృష్టించింది. ధరణి ఆపరేటర్ జగదీష్ సహాయంతో అతని బంధువుల పేరున పాస్ పుస్తకం సృష్టించింది.

దాంతో 14.63 లక్షల రైతుబంధు నిధులు స్వాహా చేశారు. ఆ డబ్బులను తాసిల్దార్, ఆపరేటర్ జగదీష్ కలిసి పంచుకున్నారు. దాంతో తహసిల్దార్ పై 420, 406 468, 467 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఆమె ప్రస్తుతం నల్గొండ జిల్లా అనుముల తాసిల్దార్ గా పనిచేస్తుంది.

MOST READ : 

మరిన్ని వార్తలు