Komatireddy Venkatreddy : భవిష్యత్ ఒలంపిక్స్ లో తెలంగాణ ముందుండేలా..!
Komatireddy Venkatreddy : భవిష్యత్ ఒలంపిక్స్ లో తెలంగాణ ముందుండేలా..!
నల్లగొండ, మన సాక్షి :
నల్గొండ జిల్లా కేంద్రంలోని ఎన్జీ కళాశాల మైదానంలో బుధవారం నిర్వహించిన ఖేలో ఇండియా వుమెన్ ఖో ఖో తెలంగాణ రాష్ట్ర సెలక్షన్ ట్రయల్స్ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి హాజరయ్యారు హాజరయ్యారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ జాతీయస్థాయి సెలక్షన్స్ కు నిర్వహిస్తున్న ట్రయల్స్ లో క్రీడాకారులందరూ రాణించాలని కోరారు. గతంలో తెలంగాణకు ఈ క్రీడలలో సిల్వర్ మెడల్ వచ్చిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. తెలంగాణ రాష్ట్రాన్ని దేశంలోనే క్రీడా రంగంలో ముందుంచేలా ప్రభుత్వం కృషి చేస్తున్నదని, ఇందులో భాగంగా గచ్చిబౌలిలో స్పోర్ట్ యూనివర్సిటీ ఏర్పాటు చేసి భవిష్యత్ ఒలంపిక్స్ లో రాష్ట్రం ముందుండే విధంగా చూస్తున్నదని చెప్పారు.
ఆటో డ్రైవర్ కుమారుడైన టాప్ బౌలర్ సిరాజ్ కు ప్రభుత్వం తరఫున గ్రూప్ వన్ ఉద్యోగంతో పాటు, 500 గజాల స్థలాన్ని, అన్ని రకాల సౌకర్యాలు కల్పించిందని చెప్పారు. విద్యార్థులు చదువుతోపాటు, క్రీడల్లో పాల్గొనాలని మంత్రి కోరారు. జనాభాలో ప్రపంచంలోనే రెండో స్థానంలో ఉన్న భారత్ ఒలంపిక్స్ పథకాల్లో చివరి నుండి రెండో స్థానంలో ఉందని,సౌత్ కొరియా లాంటి చిన్న దేశం రెండు వందల మెడల్స్ సాధిస్తే మన దేశం రెండు మెడల్స్ సాధించడం బాధాకరమైన విషయం అని అన్నారు.
ప్రతి ఒక్కరికి చదువు ఎంత ముఖ్యమో, ఆటలు కూడా అంతే ముఖ్యమని, చదువుతోపాటు ఆటలపై శ్రద్ధ చూపిస్తే శారీరకంగా ,మానసికంగా సామర్ధ్యాలను కలిగి ఉంటారని అన్నారు. ఉమెన్ ఖో ఖో క్రీడాకారులకు ప్రతీక్ ఫౌండేషన్ తరఫున ట్రాక్ సూట్ కొనుగోలుకై రెండు లక్షల రూపాయల ఇస్తున్నట్లు ప్రకటించారు.
రాష్ట్రస్థాయిలో ప్రతీక్ ఫౌండేషన్ ద్వారా ఒక టోర్నమెంట్ నిర్వహించేందుకు సిద్ధంగా ఉన్నట్లు మంత్రి ప్రకటించారు.మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాసరెడ్డి, ఖేలో ఇండియా ఉమెన్ ఖో ఖో జిల్లా కార్యదర్శి కృష్ణమూర్తి మాట్లాడారు. ఇన్చార్జ్ ఆర్డిఓ శ్రీదేవి, డిఎస్పి శివరామిరెడ్డి, మాజీ జెడ్పిటిసి లక్ష్మయ్య తదితరులు హాజరయ్యారు.
LATEST UPDATE :.









