Breaking Newsజిల్లా వార్తలుతెలంగాణనల్గొండ

Miryalaguda : మిర్యాలగూడ ప్రజలకు ఎమ్మెల్యే బిఎల్ఆర్ శుభవార్త.. వాడపల్లి క్షేత్రంలో ప్రతినెలా.. !

Miryalaguda : మిర్యాలగూడ ప్రజలకు ఎమ్మెల్యే బిఎల్ఆర్ శుభవార్త.. వాడపల్లి క్షేత్రంలో ప్రతినెలా.. !

మిర్యాలగూడ, మన సాక్షి :

నల్గొండ జిల్లా మిర్యాలగూడ నియోజకవర్గం పరిసర ప్రాంత ప్రజలకు శాసనసభ్యులు భత్తుల లక్ష్మారెడ్డి (BLR) శుభవార్త తెలియజేశారు. ఆయన శాసనసభ్యులుగా ఎన్నికైన నాటి నుంచి నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తున్నారు. మిర్యాలగూడ పట్టణ అభివృద్ధి తో పాటు గ్రామీణ ప్రాంతాలలో అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తున్నారు.

నేను నా మిర్యాలగూడ పేరుతో అనేక స్వచ్ఛంద సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఆయన ఎమ్మెల్యేగా ఎన్నికకు ముందు నుంచే నియోజకవర్గంలో అనేక స్వచ్ఛంద కార్యక్రమాలు నిర్వహించారు. ఈ విషయం అందరికి తెలిసిందే. కాగా మిర్యాలగూడ ప్రజలకు ఆయన ఓ శుభవార్త తెలియజేశారు.

నియోజకవర్గం లో ప్రధాన క్షేత్రాలుగా ఉన్న వాడపల్లి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి క్షేత్రం, ఆమనగల్లు క్షేత్రం అభివృద్ధి చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. దాంతో దేవాదాయ శాఖ మంత్రి వెంటనే స్పందించి ఆ క్షేత్రాల అభివృద్ధికి ప్రభుత్వం జీవో జారీ చేసింది.

కాగా వాడపల్లిలోని శ్రీ లక్ష్మీనరసింహస్వామి క్షేత్రంలో ప్రతినెల స్వాతి నక్షత్రం రోజున స్వామి వారి కళ్యాణం నిర్వహించనున్నట్లు దేవాదాయ శాఖ నిర్ణయించిందని ఎమ్మెల్యే బీఎల్ఆర్ తెలిపారు. దాంతో వాడపల్లి క్షేత్రం మరింత వైభవంగా వెలుగొననున్నది.

వీడియో

LATEST UPDATE : 

మరిన్ని వార్తలు