Chapati : బరువు తగ్గేందుకు రాత్రిపూట చపాతి తింటున్నారా.. అయితే ఈ విషయాలు తెలుసుకోవాల్సిందే..!

Chapati : బరువు తగ్గేందుకు రాత్రిపూట చపాతి తింటున్నారా.. అయితే ఈ విషయాలు తెలుసుకోవాల్సిందే..!
మన సాక్షి, వెబ్ డెస్క్:
ప్రస్తుత పరిస్థితుల్లో మారిన జీవన ప్రమాణాల వల్ల స్థూలకాయం అందరికీ సమస్యగా మారింది. శారీరక బరువు పెరగటం వల్ల ఇబ్బందులకు గురవుతున్నారు. తినే ఆహార పదార్థాల వల్ల లావు పెరగడం… తగ్గించుకునేందుకు నానా ప్రయత్నాలు చేస్తున్నారు.
అయితే ముఖ్య విషయం ఏంటంటే బరువు తగ్గించుకోవడానికి తినే ఆహారం తగ్గించుకోవడం చాలా ముఖ్యం. ముఖ్యంగా రాత్రిపూట చాలామంది అన్నం కు బదులు చపాతీలు తింటున్నారు. స్థూలకాయం వారు ఆసుపత్రికి వెళ్తే ఇటీవల కాలంలో డాక్టర్లు కూడా రాత్రిపూట చపాతీలు తినాలని చెబుతున్నారు. దాంతో చాలామంది రాత్రిపూట చపాతీలను తింటున్నారు.
అయితే చపాతీలు తినేవారువవ ఈ విషయాలను తప్పనిసరిగా తెలుసుకోవాల్సి ఉంది. రాత్రిపూట చపాతీలను తినేవారు ఎక్కువగా నూనె వేయకుండా కాల్చినవి తింటే మంచిది. అంతేకాకుండా అర్ధరాత్రి పూట తినడం కూడా ఆరోగ్యానికి హానికరం. తిన్న తర్వాత నిద్రపోవడానికి మధ్య కొంచెం గ్యాప్ ఉంటే బాగుంటుంది.
అదే విధంగా రాత్రిపూట ఇంతకాలం పాటు అన్నం తిని చపాతీలకు అలవాటు చేసుకునేవారు జాగ్రత్త పాటించాలి. భోజనం ప్లేట్ నిండా తింటాం కదా అని చపాతీలు కూడా మూడు నాలుగు తినడం మంచిది కాదు. కేవలం రెండు చపాతీలు మాత్రమే తీసుకోవాలి.
అన్నం కంటే చపాతీలు శరీరానికి అధిక శక్తిని ఇస్తాయి. రక్తహీనతతో బాధపడే వారు చపాతీలు తినడం వల్ల అదేమించవచ్చు. గోధుమల్లో ఐరన్ ఎక్కువగా ఉండటం వల్ల రక్తంలో హిమోగ్లోబిన్ శాతం కూడా పెరుగుతుంది.
నిద్రపోయేటప్పుడు శక్తి నామమాత్రంగానే కోల్పోతుంది. అందువల్ల మనం రెండు చపాతీలను తింటే క్యాలరీలు ఏమాత్రం తగ్గవువ అన్నం తినడం వల్ల క్యాలరీలు రాత్రిపూట ఖర్చుకాక అది కొవ్వుగా మారి మనిషి లావయ్యే అవకాశం ఉంది. గోధుమల్లో ఎలాంటి కొవ్వు పదార్థాలు ఉండకపోవడం వల్ల లావు కాకుండా ఉండేందుకు అవకాశం ఉంది.
గోధుమల్లో ఎక్కువగా బి, ఈ విటమిన్ లు, కాపర్, అయోడిన్, జింక్ , మాంగనీస్, సిలికాన్, మెగ్నీషియం, కాల్షియం ఖనిజాలు ఉంటాయి. వాటి వల్ల రాత్రిపూట చపాతీలను తింటే బరువు పెరగరు. అంతే కాకుండా బరువు ఉన్నవారు కూడా తగ్గుతారు. ఈ విషయాలను పాటిస్తూ ప్రతిరోజు రాత్రిపూట చపాతీలను తింటే ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయి.
LATEST UPDATE :
-
ఆ ప్రియురాలుకు ప్రియుడంటే పిచ్చి ప్రేమ.. అదే ఆ గ్రామస్తులకు రాత్రంతా నిద్ర లేకుండా చేసింది..!
-
Viral Video : అందమైన అమ్మాయి లిఫ్ట్ అడిగిందని బైక్ ఆపాడు.. ఆ తర్వాత బిగ్ ట్విస్ట్.. (వీడియో వైరల్)
-
Viral Video : ఏం.. టీచరమ్మ రా బాబు.. క్లాస్ రూమ్ లోనే పిల్లలతో.. (వీడియో)
-
Viral Video : ఏం.. టీచరమ్మ రా బాబు.. క్లాస్ రూమ్ లోనే పిల్లలతో.. (వీడియో)









