నల్గొండBreaking Newsఉద్యోగంతెలంగాణసంక్షేమం

District Collector : ఇందిరమ్మ కమిటీలకు డెడ్ లైన్.. ఏర్పాటు చేయాలని జిల్లా కలెక్టర్ ఆదేశం..!

District Collector : ఇందిరమ్మ కమిటీలకు డెడ్ లైన్.. ఏర్పాటు చేయాలని జిల్లా కలెక్టర్ ఆదేశం..!

నల్గొండ, మనసాక్షి :

ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా సోమవారం అయన కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో ప్రజల వద్ద నుండి ఫిర్యాదులను స్వీకరించారు. అనంతరం వివిధ అంశాలపై జిల్లా అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు.
రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు గ్రామస్థాయిలో గ్రామపంచాయతీ ప్రత్యేక అధికారి చైర్మన్ గా , స్వయం సహాయక మహిళ సంఘాల నుండి ఇద్దరు , ఎస్ సి, ఎస్టీ ,బీసీ ,ఇతరుల నుండి ముగ్గురు, కన్వీనర్ గా

గ్రామ పంచాయతీ కార్యదర్శి తో గ్రామస్థాయిలో ఇందిరమ్మ కమిటీలు ఏర్పాటు చేయాలని ,అలాగే మున్సిపల్ పట్టణ స్థాయిలో వార్డ్ కౌన్సిలర్ లేదా ప్రత్యేక అధికారి చైర్మన్ గా, స్వయం సహాయక మహిళా సంఘాల నుండి ఇద్దరు, ఎస్ సి, ఎస్టీ ,బీసీ, ఇతరుల నుండి 3, వార్డు అధికారి కన్వీనర్ గా ఉండేలా వార్డు కమిటీలను ఏర్పాటు చేయాలని, ఈ మొత్తం ప్రక్రియ మంగళవారం నాటికి (14.10.2024) పూర్తి చేయాలని ఆదేశించారు.

గతంలో ఇందిరమ్మ ఇండ్ల పట్టాలు ఇచ్చి బ్యాంకు మార్టి గేజ్ నుండి రిలీజ్ ఆయన పట్టాలను మండలాలు, గ్రామాల వారిగా జాబితా రూపొందించి సిద్ధంగా ఉంచాలని చెప్పారు. పది రోజుల్లో ఈ ప్రక్రియ పూర్తి కావాలన్నారు. ఈ విషయంపై మండల ప్రత్యేక అధికారులు ఈ నెల 16 న వారి మండలాలకు వెళ్లి పర్యవేక్షించాలని చెప్పారు.

జిల్లాలో తక్షణమే నిర్దేశించిన చోట ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించాలని ఆదేశించారు. డబల్ బెడ్ రూమ్ ఇండ్లు పూర్తయిన చోట లబ్ధిదారుల జాబితాను పారదర్శకంగా రూపొందించాలని చెప్పారు. ప్రజావాణి కార్యక్రమం ద్వారా స్వీకరించిన ఫిర్యాదులన్నింటిని వెంటనే పరిష్కరించాలని, ఫిర్యాదులు పెండింగ్ లో ఉంచవద్దని తెలిపారు.

ఈ సోమవారం మొత్తం( 34) మంది ఫిర్యాదులుదారులు వారి ఫిర్యాదులను సమర్పించగా అందులో రెవెన్యూ శాఖకు సంబంధించి (24),ఇతర శాఖలకు సంబంధించి (10) ఫిర్యాదులు ఉన్నాయి. అదనపు కలెక్టర్ జె. శ్రీనివాస్, స్పెషల్ కలెక్టర్ నటరాజ్, జిల్లా అధికారులు ప్రజల వద్ద నుండి ఫిర్యాదులను స్వీకరించారు.

LATEST UPDATE :

మరిన్ని వార్తలు