Breaking Newsఖమ్మం జిల్లాజిల్లా వార్తలుతెలంగాణవిద్య

TG News : పూణే లో ఎన్ఎస్ఎస్ ప్రీ రిపబ్లిక్ డే పరేడ్ కు మన విద్యార్ధి..!

TG News : పూణే లో ఎన్ఎస్ఎస్ ప్రీ రిపబ్లిక్ డే పరేడ్ కు మన విద్యార్ధి..!

నేలకొండపల్లి,  మన సాక్షి :

జాతీయ సేవా పధకం ఆధ్వర్యంలో పూణే లో జరిగే జాతీయ స్థాయి ప్రీ రిపబ్లిక్ డే పరేడ్ కు స్థానిక ప్రభుత్వ డిగ్రీ కాలేజీ కి చెందిన బీకాం తృతీయ సంవత్సరం కు చెందిన విద్యార్థి కోనేటి నాగరాజు ఎంపికైనట్లు కాలేజీ ప్రిన్సిపాల్ ఆలేటి పరంజ్యోతి తెలిపారు.

స్థానిక డిగ్రీ కాలేజీలో విద్యార్ధికి ఎంపిక ప్రతంను అందించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు… నవంబర్ 12 నుంచి 21 వరకు జరిగే ఈ పరేడ్ కు మన కాలేజీ నుంచి ఎంపిక కావటం పట్ల హర్షం వ్యక్తం చేశారు. జాతీయ స్థాయిలో కాలేజీ కి స్థానం కల్పించేలా కృషి చేసిన నాగరాజు ను ప్రత్యేకంగా అభినందించారు.

ఈ కార్యక్రమంలో కాలేజీ ఎన్ఎస్ఎస్ కో-ఆర్డినేటర్ ఎన్. శ్రీనివాసరావు, కామర్స్ అధ్యాపకులు డాక్టర్.ఎస్.రమేష్, డాక్టర్ నారాయణస్వామి. ఇతర ఆధ్యాపకులు పాల్గొన్నారు.

LATEST UPDATE : 

మరిన్ని వార్తలు