Miryalaguda : పంట నష్టపోయిన రైతులకు ఎకరాకు రూ. 30 వేల పరిహారం ఇవ్వాలి..!
Miryalaguda : పంట నష్టపోయిన రైతులకు ఎకరాకు రూ. 30 వేల పరిహారం ఇవ్వాలి..!
మిర్యాలగూడ, మన సాక్షి:
పంట నష్టపోయిన రైతులకు ఎకరాకు 30 వేలు పరిహారం ఇవ్వాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి అన్నారు. శుక్రవారం దామరచర్ల మండలంలోని కేజిఆర్ కాలనీ, దిలావర్ పూర్ గ్రామాలతో పాటు పలు గ్రామాలలో అకాల వర్షంతో నేలకొరిగిన పంట పొలాలలో పరిశీలించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వేలాది రూపాయల పెట్టుబడులు పెట్టి సాగు చేసుకున్న రైతులకు అకాల వర్షాలు నిండా ముంచాయని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రకృతి వైపరీత్యాల కారణంగా రైతులు నష్టపోవాల్సి వచ్చిందన్నారు.
వ్యవసాయ, రెవెన్యూ అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలన జరిపి నష్టపోయిన పంటల వివరాలను సేకరించి ఎకరాకు 30వేలు ఆర్థిక సాయం చేసి రైతులను ఆదుకోవాలన్నారు. పంటల బీమా పథకం వర్తింపజేయాలన్నారు. రైతులను ఆదుకొని ప్రభుత్వం చిత్తశుద్ధిని నిరూపించుకోవాలన్నారు. లేనిపక్షంలో రైతులను సమీకరించి ఆందోళన చేస్తామని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యులు డబ్బికారు మల్లేష్, జిల్లా నాయకులు వినోద్ నాయక్, శశిధర్ రెడ్డి, మండల నాయకులు కోటిరెడ్డి, దయానంద్, ధీరవత్ శ్రీను నాయక్, మట్టయ్య, రైతులు పీక్య, శేఖర్ రెడ్డి, వాగ్య ,హన్ము, చిన్య, చంద్రకళ తదితరులు పాల్గొన్నారు.
LATEST UPDATE :
-
Viral Video : లవ్ రెడ్డి సినిమా చూసి ప్రేక్షకురాలు ఎమోషన్.. నటుడు NT రామస్వామి పై థియేటర్ లోనే మహిళ దాడి.. ( వీడియో)
-
SURYAPET : మహిళ ఉద్యోగస్తులను వీడియో కాల్ చేయాలంటూ ఎంపిడిఓ ఒత్తిడి.. ఉద్యోగస్తులు నిరసన..!
-
BREAKING : ఉద్యోగాలు ఇస్తామని ఆశ చూపి మోసం.. కోట్ల రూపాయలతో జెండా ఎత్తిన సంస్థ..!
-
Hyderabad : ఓఆర్ఆర్ టు కొండాపూర్.. విస్తరణ పనులు..!









