Breaking Newsతెలంగాణసినిమా

Jani Master : జైలు నుంచి ఇంటికి వచ్చిన జానీ మాస్టర్.. ఎదురైన సంఘటన.. (వీడియో)

Jani Master : జైలు నుంచి ఇంటికి వచ్చిన జానీ మాస్టర్.. ఎదురైన సంఘటన.. (వీడియో)

మనసాక్షి : లైంగిక వేధింపుల ఆరోపణల కేసులో అరెస్ట్ అయిన కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ 37 రోజులపాటు జైలులో గడిపిన విషయం తెలిసిందే. కాగా ఆయన జైలు నుంచి శనివారం ఇంటికి వచ్చాడు. జైలు నుంచి ఇంటికి వెళ్లిన జానీ మాస్టర్ కు కుటుంబంతో గడిపిన క్షణాలను గుర్తుకు వచ్చాయి.

కాగా జానీ కూతురు తన తండ్రిని ఎన్ని రోజులుగా మిస్ అయిందో డ్రాయింగ్ గీసి చూపించింది. ఇంటికి వచ్చిన కొరియోగ్రాఫర్ జానీ తన పిల్లలను, భార్యని పట్టుకొని కంటతడి పెట్టుకున్నారు. యానిమల్ సినిమాలోని నాన్న నువ్వు నా ప్రాణం అనే సాంగ్ బ్యాక్ గ్రౌండ్ ప్లే చేస్తూ తన ఎక్స్ లో పోస్ట్ చేశాడు.

జానీ మాస్టర్ పై తన అసిస్టెంట్ లేడీ కొరియోగ్రాఫర్ లైంగిక వేధింపుల కేసు పెట్టిన విషయం తెలిసిందే. ఆమె ఫిర్యాదుతో సెప్టెంబర్ 16వ తేదీన నార్సింగి పోలీసులు అరెస్టు చేశారు. కాగా అతని అరెస్టుతో రకరకాల చర్చలు జరిగాయి. జానీ తప్పు చేసి ఉంటాడని కొందరు.. నిజం నిలకడ మీద తెలుస్తుందని మరి కొందరు.. ఇలా సోషల్ మీడియాలో కామెంట్స్ పెట్టారు.

MOST READ :

మరిన్ని వార్తలు