Breaking NewsTOP STORIESఆంధ్రప్రదేశ్

Good News : మహిళలకు దీపావళి శుభవార్త.. ఉచితంగా గ్యాస్ సిలిండర్.. దరఖాస్తు ఇలా..!

Good News : మహిళలకు దీపావళి శుభవార్త.. ఉచితంగా గ్యాస్ సిలిండర్.. దరఖాస్తు ఇలా..!

మన సాక్షి:

మహిళలకు కేంద్ర ప్రభుత్వం దీపావళి శుభవార్త తెలియజేసింది. అర్హులైన వారందరికీ ఉచితంగా గ్యాస్ సిలిండర్ అందించనున్నది. ఈ సంవత్సరం దీపావళి పండుగకు ప్రభుత్వం మహిళలకు ప్రత్యేకంగా కానుక అందజేయనున్నది. అర్హులైన వారందరికీ ఉచితంగా గ్యాస్ సిలిండర్ లను పంపిణీ చేయనున్నారు.

దీపావళి పండుగ సందర్భంగా ప్రభుత్వం ఉద్యోగులకు బోనస్ ఇస్తుండడంతో పాటు, ప్రైవేట్ కంపెనీలలో పని చేసే వారికి కూడా వారి యాజమాన్యాలు బహుమతులు అందజేస్తాయి. కాగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కూడా వివిధ పథకాలను దీపావళికి తీసుకొస్తున్నాయి.

ఉచిత గ్యాస్ సిలిండర్ పథకానికి దరఖాస్తు :

ప్రభుత్వం అందజేసే ఉచిత గ్యాస్ పథకానికి దరఖాస్తుల చేసుకోవాలి. ప్రధానమంత్రి ఉజ్వల యోజన లో దరఖాస్తు చేసుకోవడానికి ప్రభుత్వం కొన్ని అర్హతలు నిర్దేశించింది. ఈ అర్హతలు ఉన్న మహిళలు దీపావళికి ఉచితంగా గ్యాస్ సిలిండర్ దరఖాస్తులను చేసుకోవచ్చును. ఉచిత గ్యాస్ సిలిండర్ కావలసిన వారు కామన్ సర్వీస్ సెంటర్ కు వెళ్లి దరఖాస్తు చేసుకోవచ్చు. లేదంటే సమీపంలో ఉన్న ఎల్పీజీ డిస్ట్రిబ్యూటర్ వద్దకు వెళ్లి కూడా స్కీం కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.

ఉజ్వల పథకం లబ్ధిదారులకు దీపావళి ముందు ఉచితంగా గ్యాస్ సిలిండర్లు ఇప్పుడు ఉత్తర ప్రదేశ్, ఉత్తరఖండ్, ఆంధ్ర ప్రదేశ్ లో ఈ పథకం లభిస్తుంది. ఈ పథకం కింద లబ్ధి పొందుతున్న మహిళలకు ప్రభుత్వం అక్టోబర్ 31 నుంచి ఉచిత గ్యాస్ సిలిండర్ను అందజేయనున్నది. ఇప్పటివరకు ఈ పథకం లబ్ధిదారులకు సిలిండర్లపై సబ్సిడీ ఉంది.

MOST READ : 

మరిన్ని వార్తలు