TOP STORIESBreaking Newsపండుగలు

Miryalaguda : దీపావళి మంగళహారతులు ఏరోజు.. పండుగ జరుపుకునేది ఎప్పుడు..!

Miryalaguda : దీపావళి మంగళహారతులు ఏరోజు.. పండుగ జరుపుకునేది ఎప్పుడు..!

మిర్యాలగూడ, మన సాక్షి:

ఈ ఏడాది దీపావళి అమావాస్య రెండు రోజులపాటు రావడంతో మంగళహారతులు, పండుగ ఎప్పుడు జరుపుకోవాలని సందిగ్ధంలో ఉన్నారు. దీపావళి పండుగ హిందువులలో అతిపెద్ద పండుగ. ఈ పండుగను దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలలో వివిధ సాంప్రదాయాల ప్రకారం జరుపుకోవడం ఆనవాయితీగా వస్తుంది.

తెలుగు రాష్ట్రాలలో పండుగ ఎప్పుడు జరుపుకోవాలి. అనే విషయంపై సందిగ్ధత నెలకొన్నది. కాగా వేద పండితులు తెలియజేసిన ప్రకారం దీపావళి పండుగను నవంబర్ 1వ తేదీన జరుపుకోవాలని పేర్కొన్నారు.

నవంబర్ 1వ తేదీన దీపావళి పండుగను నిర్వహించుకోవాలని నల్గొండ జిల్లా మిర్యాలగూడ కు చెందిన బ్రహ్మశ్రీ ప్రముఖ జ్యోతిష్య శాస్త్ర మరియు వేద పండితులు పుల్లాభట్ల లక్ష్మీనారాయణ శర్మ పేర్కొన్నారు.. తిధులు వ్యత్యాసం వలన ఈ సమస్య ఏర్పడిందని చెప్పారు.

అక్టోబర్ 30వ తేదీ చతుర్దశి మధ్యాహ్నం 12.35 గంటల నుంచి ప్రారంభమైతున్న నేపథ్యంలో గురువారం తెల్లవారుజామున (31/10/2024) సూర్యుడు ఉదయించే సమయంలో) నాలుగు గంటల నుంచి ఆరున్నర వరకు మంగళహారతులు పట్టుకోవాలని (31/10/24) చెప్పారు.

అదే రోజు సాయంత్రం లక్ష్మీ పూజలు, ధనలక్ష్మి పూజలు నిర్వహించుకోవాలని సూచనలు చేశారు. నవంబర్ 1వ తేదీ దీపావళి పర్వదినాన్ని ఘనంగా నిర్వహించుకోవాలని తెలిపారు. దీపావళి రోజున కేదారేశ్వర నోములు, మరియు కొత్త నోములు పట్టుకోవచ్చని చెప్పారు.

LATEST UPDATE : 

మరిన్ని వార్తలు