Survey : సమగ్ర సర్వేకు ఉపాధ్యాయుల జాబితా సిద్ధం..!
Survey : సమగ్ర సర్వేకు ఉపాధ్యాయుల జాబితా సిద్ధం..!
నారాయణపేట టౌన్, మనసాక్షి :
రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 6 నుంచి ప్రతిష్టాత్మకంగా చేపట్టబోయే సమగ్ర కుటుంబ ఇంటింటి సర్వే నిర్వహణకు జిల్లాలోని ప్రాథమిక పాఠశాల హెచ్ఎంలు, ఎస్ జి టి ఉపాధ్యాయులు జాబితా సిద్ధం చేయాలని జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ అధికారులకు సూచించారు.
శుక్రవారం కలెక్టరేట్ లోని తన ఛాంబర్ లో జిల్లా ప్రణాళిక అధికారులు, విద్యాశాఖ అధికారులతో సమీక్ష జరిపారు. సర్వేకు సంబంధించి జిల్లాలో మొత్తం 1180 మంది అవసరమని, వారిలో హెచ్ఎంలు, ఎస్ జి టి ఉపాధ్యాయుల పాత్ర ఎంతో కీలకమని ఆమె తెలిపారు.
జిల్లాలోని ఆయా ఉపాధ్యాయుల జాబితా ను శనివారం సిద్ధం చేసి ఇవ్వాలని, ఇంకా అవసరమైతే ఇతర ప్రభుత్వ శాఖల ఉద్యోగులకు సర్వే నిర్వహణ బాధ్యతలను అప్పగిస్తామని ఆమె తెలిపారు. సర్వే బాధ్యతల ఆర్డర్లను తీసుకున్న ఉపాధ్యాయులకు ఒకరోజు ప్రత్యేక శిక్షణ ఇవ్వడం జరుగుతుందని, శిక్షణ పొందిన ఉపాధ్యాయులు ఈ నెల 6 నుంచి ఉదయం వేళలో తమకు కేటాయించిన గ్రామాలు, వార్డులలో సమగ్ర కుటుంబ ఇంటింటి సర్వే చేపట్టాల్సి ఉంటుందని కలెక్టర్ తెలిపారు.
ఈ సమీక్షలో డిఆర్డిఓ మొగులప్ప, జిల్లా విద్యాశాఖ కార్యాలయ అధికారులతో పాటు కొత్తగా జిల్లా ప్రణాళిక అధికారిగా బాధ్యతలు చేపట్టిన యోగానంద్ జిల్లా కలెక్టర్ ను మర్యాదపూర్వకంగా కలిసి సమీక్షలో పాల్గొన్నారు.
LATEST UPDATE :
-
TG News : పర్యాటకులకు గుడ్ న్యూస్.. నేటి నుంచి శ్రీశైలం, నాగార్జునసాగర్ లో లాంచీ సేవలు, టూర్ ప్యాకేజీలు..!
-
Gold Price : తెలుగు మహిళలకు శుభవార్త.. రూ.7700 రికార్డు స్థాయిలో తగ్గిన పసిడి ధర..!
-
Gold Price : తెలుగు మహిళలకు శుభవార్త.. రూ.7700 రికార్డు స్థాయిలో తగ్గిన పసిడి ధర..!
-
UPI : యూపీఐ ద్వారా పేమెంట్స్ చేస్తున్నారా.. అయితే కొత్త రూల్స్ నేటి నుంచే.. తెలుసుకోండి..!









