తెలంగాణBreaking Newsజిల్లా వార్తలునల్గొండ

District collector : ధాన్యం సేకరణ, కష్టమ్ మిల్లింగ్ లో మార్పులు.. మిల్లర్లు సహకరించాలి..!

District collector : ధాన్యం సేకరణ, కష్టమ్ మిల్లింగ్ లో మార్పులు.. మిల్లర్లు సహకరించాలి..!

నల్లగొండ, మన సాక్షి :

ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈ వానకాలం పండించిన ధాన్యం సేకరణ, కష్టం మిల్లింగ్ రైస్ (సి ఎం ఆర్) సకాలంలో చెల్లించేందుకు జిల్లా రైస్ మిల్లర్లు సహకరించాలని కోరిన జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి కోరిక మేరకు జిల్లా రైస్ మిల్లర్ల అసోసియేషన్ ఏకగ్రీవంగా అంగీకరించింది. ఇదే విషయమై శనివారం జిల్లా కలెక్టర్ ఛాంబర్ లో, అలాగే కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో జిల్లా రైస్ మిల్లర్లతో, జిల్లా కలెక్టర్, పౌరసరఫరాల అధికారులు సమావేశం నిర్వహించారు.

రాష్ట్ర ప్రభుత్వం 2024 -25 ధాన్యం సేకరణ, అలాగే కష్టం మిల్లింగ్ రైస్ విషయంలో పలు మార్పులు తీసుకువచ్చిందని, ఇందులో భాగంగా సన్న రకానికి 500 రూపాయల బోనస్ ఇవ్వడం, మిల్లర్లకు మిల్లింగ్ చార్జీలు పెంచడం, సిఎంఆర్ కేటాయింపుకు మిల్లర్లు బ్యాంకు గ్యారంటీ సమర్పించడం వంటివి ప్రభుత్వం నుండి వచ్చిన కొత్త నియమాలని, వీటన్నిటిపై ఇదివరకే మిల్లర్లకు తెలియజేయడం జరిగిందని, అందువల్ల వీటిని దృష్టిలో ఉంచుకొని మిల్లర్లు సాధ్యమైనంతవరకు 2024-25 దాన్యం సేకరణకు సహకరించాలని, అలాగే ధాన్యం డెలివరీ చేయడంలో,సి ఎం ఆర్ పై సహకారం అందించాలని కోరారు.

ప్రభుత్వ ఆదేశాల మేరకు దాన్యం కేటాయించిన 10 రోజుల్లో బ్యాంకు గ్యారంటీ సమర్పించేందుకు అండర్ టేకింగ్ ఇవ్వాలని జిల్లా కలెక్టర్ కోరారు. ఇందుకు జిల్లా రైస్ మిల్లర్ల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు కర్నాటి రమేష్, జిల్లా అధ్యక్షులు నారాయణ, మిర్యాలగూడ రైస్ మిల్లర్ల సంఘం అధ్యక్షులు శ్రీనివాస్ లు రైస్ మిల్లర్ల తరఫున మాట్లాడుతూ, సీఎంఆర్ సకాలంలో చెల్లించేందుకు మిల్లర్లకు అవసరమైన వసతులు కల్పించాలని, అలాగే 10 రోజులు ఉన్న బ్యాంకు గ్యారంటీ అండర్ టేకింగ్ సమయాన్ని 15 రోజులకు పెంచాలని, పెండింగ్ లో ఉన్న ట్రాన్స్పోర్ట్ బిల్లులు, మిల్లింగ్ చార్జెస్ చెల్లించాలని, ఇందుకు తాము ప్రభుత్వ ఆదేశాల మేరకు సీఎంఆర్ చెల్లించేందుకు సిద్ధంగా ఉన్నామని తెలియజేశారు.

అదే విధంగా బియ్యం చెల్లించే శాతాన్ని తగ్గించాలని మిల్లర్లు జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకురాగా, వీటన్నిటిపై సమీక్షించిన అనంతరం జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ మిల్లులకు ధాన్యం పంపించిన 15 రోజుల్లో మిల్లర్లు బ్యాంకు గ్యారంటీ సమర్పించేందుకు సమ్మతించారు. ఆ విధంగా తక్షణమే అండర్ టేకింగ్ లు ఇవ్వాలని కలెక్టర్ కోరగా, రైస్ మిల్లర్లు అక్కడికక్కడే జిల్లా కలెక్టర్ కు సమర్పించారు.

అలాగే పెండింగ్ లో ఉన్న ట్రాన్స్ పోర్ట్ చార్జీలు,మిల్లింగ్ చార్జీలు చెల్లించేందుకు ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లడం జరుగుతుందని ఆమె తెలియజేశారు. అదనపు కలెక్టర్ జే. శ్రీనివాస్ జిల్లా పౌర సరఫరాల అధికారి వెంకటేశ్వర్లు, పౌరసరఫరాల జిల్లా మేనేజర్ హరీష్, వ్యవసాయ శాఖ జెడి శ్రవణ్, ఎల్ డి ఎం శ్రామిక్ ,నల్గొండ ఆర్డిఓ అశోక్ రెడ్డి, రైస్ మిల్లర్లు, తదితరులు ఈ సమావేశానికి హాజరయ్యారు.

MOST READ :

మరిన్ని వార్తలు