Breaking Newsఉద్యోగంజిల్లా వార్తలుతెలంగాణనల్గొండ

Miryalaguda : నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. రేషన్ డీలర్ల నియామకానికి దరఖాస్తుల ఆహ్వానం..!

Miryalaguda : నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. రేషన్ డీలర్ల నియామకానికి దరఖాస్తుల ఆహ్వానం..!

మిర్యాలగూడ, మన సాక్షి :

తెలంగాణ ప్రభుత్వం నిరుద్యోగులకు శుభవార్త తెలియజేసింది. ఖాళీగా ఉన్న రేషన్ డీలర్లను భర్తీ చేయడానికి నోటిఫికేషన్ జారీ చేసింది. అందులో భాగంగా మిర్యాలగూడ డివిజన్ పరిధిలో ఉన్న రేషన్ డీలర్ల నియామకానికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు సబ్ కలెక్టర్ నారాయణ్ అమిత్ ఉత్తర్వులు జారీ చేశారు.

మిర్యాలగూడ డివిజన్ పరిధిలోని 30 రేషన్ డీలర్ల ఖాళీలకు గాను దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు తెలిపారు. ఈనెల నవంబర్ 4వ తేదీ నుంచి నవంబర్ 18 వ తేదీ వరకు సంబంధిత తహసిల్దార్ కార్యాలయాలలో దరఖాస్తులు అందజేయాలని ఆయన కోరారు.

ఆసక్తి ఉన్నవారు విద్యార్హత, కులం, నివాస ధ్రువీకరణ పత్రాలతో పాటు గెజిటెడ్ చేసిన సర్టిఫికెట్లను, రూ.250 డిడి ద్వారా చెల్లించాలని ఆయన తెలిపారు.

ఒక వ్యక్తి ఒక షాపుకు మాత్రమే దరఖాస్తు చేయాలని, రిజర్వేషన్ల వారీగా కేటాయింపుల ఆధారంగా దరఖాస్తు చేసుకోవాలని ఆయన పేర్కొన్నారు. దరఖాస్తుదారుడు కనీస విద్యార్హత పదవ తరగతి ఉండాలని పేర్కొన్నారు. అదేవిధంగా ఖాళీగా ఉన్న చౌక ధరల దుకాణం ఉన్న వార్డు, కానీ గ్రామంలో కానీ నివాసితుడు ఉండాలని తెలిపారు.

ఎంపికైన వ్యక్తి కనీసం ఐదు సంవత్సరాల పాటు పనిచేయాల్సి ఉంటుందని, అతనికి ఇతర వ్యాపారాలతో సంబంధం ఉండకూడదని తెలిపారు. రాత పరీక్ష ద్వారా డీలర్లను నియమించనున్నట్లు తెలిపారు. 100 మార్కులకు పరీక్ష ఉంటుందని, దానిలో 80 మార్కులు రాత పరీక్ష, 20 మార్కులు ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేయనున్నట్లు ఆయన పేర్కొన్నారు.

MOST READ :

మరిన్ని వార్తలు