Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsక్రైంజిల్లా వార్తలుతెలంగాణనల్గొండహైదరాబాద్

Accident : హైదరాబాదు నుంచి మిర్యాలగూడ వెళ్తున్న ఆర్టీసీ బస్సు బోల్తా..!

Accident : హైదరాబాదు నుంచి మిర్యాలగూడ వెళ్తున్న ఆర్టీసీ బస్సు బోల్తా..!

మన సాక్షి , తెలంగాణ బ్యూరో :

మిర్యాలగూడ ఆర్టీసీ డిపో కు చెందిన ఎక్స్ ప్రెస్ బస్సు యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం బొర్రోళ్ళ గూడెం సమీపంలో 65వ నెంబర్ జాతీయ రహదారిపై సోమవారం బోల్తా పడింది.

హైదరాబాద్ నుంచి మిర్యాలగూడ వైపు వెళ్తున్న ఈ బస్సు బుర్రోళ్ల గూడెం సమీపంలోకి రాగానే అదుపుతప్పి బోల్తా పడింది. చౌటుప్పల్ పోలీస్ ఇన్స్పెక్టర్ మన్మధరావు తెలిపిన వివరాల ప్రకారం..

నల్లగొండ జిల్లా మిర్యాలగూడ ఆర్టీసీ డిపోకు చెందిన బస్సు 50 మంది ప్రయాణికులతో హైదరాబాద్ నుంచి మిర్యాలగూడ వెళ్తుంది. కాగా చౌటుప్పల్ మండలం బోర్రోళ్ల గూడెం సమీపంలోకి రాగానే అదుపుతప్పి బోల్తా పడింది.

ఈ సంఘటనలో నలుగురు ప్రయాణికులకు గాయాలయ్యాయి. ప్రమాదంలో నల్గొండ జిల్లా నార్కెట్పల్లికి చెందిన బొప్పని విజయ, చౌటుప్పల్ మండల కేంద్రానికి చెందిన మారుపాక అనిత, నల్లగొండ జిల్లా నాంపల్లికి చెందిన అండాలతో పాటు బస్సు డ్రైవర్ జానయ్య గాయపడ్డారు.

ఈ సంఘటన జరిగిన వెంటనే పోలీసులు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకొని క్షతగాత్రులను చౌటుప్పల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆర్టీసీ డ్రైవర్ అజాగ్రత్త, అతివేగం కారణంగానే ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్లుగా తెలుస్తోంది. బస్సు ప్రయాణికుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

MOST READ : 

మరిన్ని వార్తలు