Cotton : సీసీఐ కేంద్రాలలో విక్రయించి.. పత్తి కి మద్దతు ధర రూ.7521 పొందాలి..!
Cotton : సీసీఐ కేంద్రాలలో విక్రయించి.. పత్తి కి మద్దతు ధర రూ.7521 పొందాలి..!
శాలిగౌరారం, మనసాక్షి :
పత్తి రైతులు ప్రభుత్వం ఏర్పాటు చేసిన సి సి ఐ కేంద్రాలలో పత్తి ని విక్రయుంచి మద్దతు ధర పొందాలని తుంగతుర్తి శాసనసభ్యులు మందుల సామెల్ అన్నారు. శాలిగౌరారం మండలం మాదారం లోని టిఆర్ఆర్ కాటన్ మిల్ లో ఏర్పాటు చేసిన సీసీఐ కొనుగోలు కేంద్రాన్ని బుధవారం ఎమ్మెల్యే మందుల సామెల్ ప్రారంభించారు.
ఈ సందర్బంగా సామేల్ మాట్లాడుతూ రైతులు కొనుగోలు కేంద్రానికి తీసుక వచ్చిన పత్తిని తూకం లో ఎలాంటి తేడాలు లేకుండా కొనుగోలు చేయాలన్నారు. రైతులు నాణ్యత ప్రమాణాలు పాటించి కనీస మద్దతు ధర 7521 రూపాయలు పొందాలన్నారు. మధ్య దళారుల మాటలు నమ్మి పత్తిని బయట విక్రయించవద్దన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు అన్ని విధాలుగా అండగా ఉంటుందన్నారు. శాలిగౌరారం మండలం లో దశల వారీగా తారు రోడ్లు వేయిస్తాన్నారు. ఈ కార్యక్రమం లో జిల్లా మార్కెటింగ్ అధికారి ఛాయాదేవి, తహసీల్దార్ పి. యాదగిరి, ఎంపీడీఓ గార్లపాటి జ్యోతి లక్ష్మి, సింగల్ విండో ఛైర్మెన్ తాళ్లూరి మురళీ, మార్కెట్ కార్యదర్శి చీనా నాయక్,
సీసీఐ సీపీఓ రాజు, ఇంచార్జ్ రాజశేఖర్, కాటన్ మిల్ యజమాని తానం జోజి రెడ్డి, కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు అన్నెబోయిన సుధాకర్, నాయకులు నోముల జనార్దన్, పాదురి శంకర్ రెడ్డి, బెల్లి వీరభద్రం,వేముల గోపినాథ్, అల్లి సైదులు, బొమ్మగాని రవి,నీకోల్ రెడ్డి, నోముల రవికుమార్, తోటకూరి పరశురాములు, తదితరులు పాల్గొన్నారు.
MOST READ :
-
Devarakonda : హత్య చేశారు ఆత్మహత్యగా చిత్రీకరించారు.. జాతీయ రహదారిపై మృతుడి బంధువుల ధర్నా..!
-
Survey : సమగ్ర కుటుంబ సర్వేలో.. ఇంటికి తాళం వేసి ఉంటే ఎలా..!
-
Indiramma House : రేషన్ కార్డు లేకున్నా ఇందిరమ్మ ఇల్లు.. మంజూరు ఎలాగంటే..!
-
Gold Price : పసిడి ప్రియుల్లో ఆనందం.. పడిపోతున్న బంగారం ధరలు.. ఈరోజు ధర..!









