Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
తెలంగాణBreaking Newsజిల్లా వార్తలునల్గొండవ్యవసాయం

District collector : ధాన్యం సేకరణలో ఏఈఓ లు రైతులకు అందుబాటులో ఉండాలి.. జిల్లా కలెక్టర్ ఆదేశం..!

District collector : ధాన్యం సేకరణలో ఏఈఓ లు రైతులకు అందుబాటులో ఉండాలి.. జిల్లా కలెక్టర్ ఆదేశం..!

నల్గొండ, మనసాక్షి :

నల్గొండ లోని కలెక్టరేట్లో ఉదయాదిత్య భవన్ లోసోమవారం ధాన్యం సేకరణ పై నిర్వహించిన సమావేశానికి కలెక్టర్ ఇలా త్రిపాఠి హాజరై వ్యవసాయ విస్తరణ అధికారులకు పలు సూచనలు చేశారు.

ఏ ఈ ఓ లు తప్పనిసరిగా వారి పరిధిలోని ధాన్యం కొనుగోలు కేంద్రాలను నిరంతరం పర్యవేక్షిస్తూ రైతులకు అందుబాటులో ఉండాలన్నారు. దాన్యం కొనుగోలును ప్రతిరోజు పర్యవేక్షించాలని, ప్రభుత్వం ధాన్యానికి ప్రకటించిన మద్దతు ధర పొందేందుకు రైతులకు సహకరించాలని, నాణ్యతా ప్రమాణాలతో ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తీసుకువచ్చేలా రైతులకు అవగాహన కల్పించాలని చెప్పారు.

అలాగే సరైన తేమశాతంతో కొనుగోలు కేంద్రాలకు తెచ్చిన ధాన్యాన్ని తక్షణమే కొనుగోలు చేసి మిల్లులకు పంపించాలని తెలిపారు. అకాల వర్షాల వల్ల ధాన్యం తడవకుండా ఉండేందుకు ముందు జాగ్రత్తగా ఇటు రైతులను, అటు కేంద్రం నిర్వాహకులను అప్రమత్తం చేయడమే కాకుండా ,టార్పాలిన్లు, తూకం యంత్రాలు, అన్ని సిద్ధంగా ఉండేలా చూడాలని తెలిపారు.

ధాన్యం కొనుగోలు కేంద్రాలలో తలెత్తే సమస్యలను ఎప్పటికప్పుడు తమ దృష్టికి తీసుకురావాలని, ధాన్యం సేకరణ పట్ల ఎట్టి పరిస్థితులలో నిర్లక్ష్యంగా ఉండవద్దని ఆమె తెలిపారు. సన్న రకం ధాన్యాన్ని నిర్ధారించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సరఫరా చేసిన క్యాలిపర్స్ పై వ్యవసాయ విస్తరణ అధికారులకు ఈ సందర్భంగా శిక్షణ ఇవ్వడం జరిగింది.

అదరపు కలెక్టర్ జే. శ్రీనివాస్, మిర్యాలగూడ సబ్ కలెక్టర్ నారాయణ్ అమిత్, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి శ్రవణ్, వ్యవసాయ శాఖ సహాయ సంచాలకులు ,తదితరులు హాజరయ్యారు.

MOST READ : 

మరిన్ని వార్తలు