Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsజిల్లా వార్తలుతెలంగాణనల్గొండవ్యవసాయం

Miryalaguda : రైస్ మిల్లు యాజమాన్యంపై క్రిమినల్ కేసు పెట్టాలని పోలీస్ స్టేషన్ లో రైతు ఫిర్యాదు..!

Miryalaguda : రైస్ మిల్లు యాజమాన్యంపై క్రిమినల్ కేసు పెట్టాలని పోలీస్ స్టేషన్ లో రైతు ఫిర్యాదు..!

మిర్యాలగూడ, మన సాక్షి :

మిర్యాలగూడలోని  రైస్ మిల్లు యాజమాన్యం పై క్రిమినల్ కేసు పెట్టాలని వేములపల్లి పోలీస్ స్టేషన్లో ఓ రైతు ఫిర్యాదు చేశారు. వివరాల ప్రకారం.. మాడుగుల పల్లి మండలం భీమనపల్లి గ్రామానికి చెందిన నామిరెడ్డి శ్రీధర్ రెడ్డి తాను విక్రయించిన దాన్యంలో వివిధ రకాలుగా కోత పెట్టి తనను మోసం చేశారని సోమవారం వేములపల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.

తాను మహర్షి రైస్ మిల్లులో అక్టోబర్ 13వ తేదీన 2 ట్రాక్టర్ల సన్నధాన్యమును వారు చెప్పిన ధరకు విక్రయించినట్లు తెలిపారు.

తనతో పాటు చాలామంది రైతులు కూడా ఆయా రైస్ మిల్లులలో ధాన్యం విక్రయించారని పేర్కొన్నాడు. ధాన్యం విక్రయించిన సమయంలో హమాలీలు కానీ, గుమస్తాలు గానీ తమకు ఎలాంటి సహకారం చేయలేదని పేర్కొన్నాడు.

కాగా తాను ధాన్యం విక్రయించిన డబ్బుల కోసం రైస్ మిల్లుకు వెళ్లగా హమాలి ఖర్చు, గుమస్తా రుసుము, సిసి కటింగ్ అని ఒక శాతం కట్ చేసుకున్నట్లు తెలిపారు. ఇవన్నీ కట్ చేసుకున్న తర్వాతనే తనకు రావాల్సిన డబ్బులను బ్యాంకు ఖాతాలో జమ చేసినట్లు తెలిపారు.

తాను విక్రయించిన ధాన్యం కు రావలసిన డబ్బులలో కోత విధించి డబ్బులు ఇస్తున్నారని, మిల్లర్లు సిండికేట్ గా ఏర్పడి దోపిడీకి పాల్పడుతున్నారని శ్రీధర్ రెడ్డి పేర్కొన్నారు. తనను మోసం చేసిన రైస్ మిల్లు యాజమాన్యంపై క్రిమినల్ కేసు పెట్టాలని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు తెలిపారు.

MOST READ : 

మరిన్ని వార్తలు