తెలంగాణBreaking Newsఉద్యోగంజిల్లా వార్తలునల్గొండవ్యవసాయం

District collector : ధాన్యంలో తేమశాతాన్ని స్వయంగా పరిశీలించిన జిల్లా కలెక్టర్..!

District collector : ధాన్యంలో తేమశాతాన్ని స్వయంగా పరిశీలించిన జిల్లా కలెక్టర్..!

నల్లగొండ, మన సాక్షి :

సరైన తేమ శాతంతో వచ్చిన ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేసి పంపించాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి ధాన్యం కొనుగోలు కేంద్రాల నిర్వహకులను ఆదేశించారు. మంగళవారం ఆమె నల్గొండ జిల్లా, హాలియా వ్యవసాయ మార్కెట్ యార్డులో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు.

హాలియా పరిధిలో కోతలు ఎప్పుడు పూర్తవుతాయని? రైతులు ప్రైవేటు మిల్లులు, కొనుగోలు కేంద్రాలకు ధాన్యాన్ని తీసుకువెళ్తున్నారా? ఈ ప్రాంతంలో ఏ రకం ధాన్యం ఎక్కువగా పండుతున్నదని ? జిల్లా కలెక్టర్ అడిగారు.

ఈ ప్రాంతంలో సన్నధాన్యం ఎక్కువగా పండుతుందని, డిసెంబర్ 15 నాటికీ కోతలు పూర్తవుతాయని, ప్రైవేటు మిల్లులకు కూడా రైతులు ధాన్యాన్ని తీసుకువెళ్తారని హాలియా వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ తుమ్మలపల్లి చంద్రశేఖర్ రెడ్డి, రైతులు జిల్లా కలెక్టర్ కు తెలిపారు.

మహేంద్ర రకం దాన్యం త్వరగా తేమ శాతం తగ్గడం లేదని, ధాన్యం ఉత్పత్తి తక్కువగా వస్తున్నదని, అందువల్ల ఈ విషయంపై ఒక నిర్ణయం తీసుకోవాలని మార్కెట్ కమిటీ చైర్మన్ జిల్లా కలెక్టర్ తో విజ్ఞప్తి చేసారు.

కొనుగోలు కేంద్రంలో ఉన్న బి పి టి, మహేంద్ర ,ఇతర అన్ని రకాల ధాన్యాన్ని కలెక్టర్ తనిఖీ చేశారు .అంతేకాక తేమ శాతాన్ని సైతం పరిశీలించారు.
కాగా మార్కెట్ కు వచ్చిన ఎక్కువ శాతం దాన్యం పూర్తి నాణ్యత ప్రమాణాలు లేకుండా రావడం గమనించి, చేత్తా, తాలు లేకుండా, శుభ్రంగా ఆరబెట్టి తూర్పార బట్టి కొనుగోలు కేంద్రాలకు ధాన్యాన్ని తీసుకువచ్చేలా రైతులకు అవగాహన కల్పించాలని, ఒకవేళ సరైన తేమ శాతంతో ధాన్యం కేంద్రాలకు వస్తే వెంటనే కొనుగోలు చేయాలని, అనవసరంగా జాప్యం చేయవద్దని జిల్లా కలెక్టర్ చెప్పారు.

ఎంతమంది హమాలీలు ఉన్నారని? ఎన్ని లారీలు ఉన్నాయని ?అడిగి తెలుసుకోగా ,30 మంది హమాలీలు ఉన్నారని, అవసరం బట్టి లారీలను ఏర్పాటు చేస్తున్నామని కాంట్రాక్టర్ జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చారు. వచ్చేవారం ఎక్కువగా ధాన్యం వచ్చే అవకాశం ఉన్నందున ఎక్కువ లారీలను ఏర్పాటు చేయాలని, అలాగే 60 మంది హమాలీలను ఏర్పాటు చేయాల్సిందిగా ఆదేశాలు జారీ చేశారు.

అనంతరం జిల్లా కలెక్టర్ హాలియా మున్సిపల్ పరిధిలోని ఆరవ వార్డులో సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ మరియు కుల సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వ ను తనిఖి చేశారు.

ఆరవ వార్డు లో 95 గృహాలకు గాను, ఇప్పటివరకు 34 గృహాల సర్వే పూర్తి చేయడం జరిగిందని ఎన్యుమరేటర్ కృష్ణవేణి జిల్లా కలెక్టర్ కు తెలుపగా, సర్వే తీరును పరిశీలించిన అనంతరం ఆమె సంతృప్తి వ్యక్తం చేసి సర్వే బాగా చేస్తున్నారని అభినందించారు.

అనంతరం ఆమె ఊట్కూరు గ్రామంలో ఐకెపి ద్వారా ఏర్పాటుచేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని తనిఖీ చేసి కేంద్రానికి వచ్చిన ధాన్యం తేమను పరిశీలించారు. కొనుగోలు చేసి మిల్లులకు పంపించేందుకు బ్యాగులలో సిద్ధంగా ఉన్న ధాన్యాన్ని తక్షణమే మిల్లులకు తరలించాలని చెప్పారు.

వాతావరణం వర్షం వచ్చే అవకాశం ఉన్నందున సరైన తేమతో వచ్చిన ధాన్యం కొనుగోలు చేసి పంపించాలని ఆదేశించారు.జిల్లా పౌరసరఫరాల అధికారి వెంకటేశ్వర్లు, మున్సిపల్ కమిషనర్ ఎం. దుర్గారెడ్డి, ఎంపీడీవో సుజాత, తహసిల్దార్, తదితరులు జిల్లా కలెక్టర్ వెంట ఉన్నారు.

MOST READ : 

మరిన్ని వార్తలు