Nalgonda : ప్రశాంతంగా ముగిసిన మొదటి రోజు గ్రూప్-3 పరీక్ష..!
Nalgonda : ప్రశాంతంగా ముగిసిన మొదటి రోజు గ్రూప్-3 పరీక్ష..!
నల్లగొండ, మన సాక్షి :
నల్గొండ జిల్లాలో మొదటి రోజు నిర్వహించిన గ్రూప్ -3 పరీక్షలు ప్రశాంతంగా ముగిసినట్లు జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి తెలిపారు.గ్రూప్ -3 పరీక్షలు ప్రారంభమైన వెంటనే ఆమె నల్గొండ జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన పలు పరీక్ష కేంద్రాలను తనిఖీ చేశారు.
ముందుగా సెయింట్ ఆల్ఫాన్సెస్ పాఠశాలలో ఏర్పాటు చేసిన పరీక్ష కేంద్రాన్ని సందర్శించి అక్కడ పరీక్షకు హాజరైన,గైర్హాజరైన అభ్యర్థుల వివరాలను పరీక్ష కేంద్రం చీఫ్ సూపరింటెండెంట్ డి .రాంబాబుతో అడిగి తెలుసుకున్నారు. కాగా ఈ కేంద్రంలో 528 మంది అభ్యర్థులను కేటాయించగా జిల్లా కలెక్టర్ కేంద్రాన్ని సందర్శించే సమయానికి సగానికి పైగా గైర్హాజరైనట్లు ఆయన తెలిపారు.
తర్వాత జిల్లా కలెక్టర్ డాన్ బాస్కో హై స్కూల్లో ఏర్పాటు చేసిన పరీక్ష కేంద్రాన్ని సందర్శించి తనిఖీ చేశారు. ఈ కేంద్రానికి 348 మంది అభ్యర్థులను కేటాయించగా, 155 మంది పరీక్షకు హాజరుకాగా, 193 మంది గైర్హాజరయ్యారు .ఈ వివరాలను చీఫ్ సూపరింటీండెంట్ రాయప్ప కలెక్టర్ కు తెలియజేశారు.
అనంతరం జిల్లా కలెక్టర్ ఎన్జీ కళాశాలలో ఏర్పాటు చేసిన పరీక్షా కేంద్రాన్ని కూడా పరిశీలించారు. అక్కడ పరీక్ష కేంద్రం వివరాలను చీఫ్ సూపరింటెండెంట్ అనిల్ కుమార్ జిల్లా కలెక్టర్ కు తెలియజేస్తూ 480 మందికి గాను 410 మంది హాజరయ్యారని, 70 మంది గైర్హాజరయ్యారని తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ఎన్జీ కళాశాలలో ఏర్పాటుచేసిన గ్రూప్- 3 పరీక్షల స్ట్రాంగ్ రూమును తనిఖీ చేశారు.
మధ్యాహ్నం పరీక్ష పూర్తయిన తర్వాత మిర్యాలగూడ, నల్గొండ పట్టణాలలో నిర్వహించిన గ్రూప్-3 పరీక్షల వివరాలను ఆమె తెలియజేస్తూ నల్గొండ పట్టణంలో ఏర్పాటు చేసిన 35 పరీక్ష కేంద్రాలకు ఉదయం 12216 మంది అభ్యర్థులను కేటాయించగా , పరీక్షకు 8810 మంది అభ్యర్థులు హాజరయ్యారని, 3406 మంది గైరు హాజరయ్యారని తెలిపారు. మధ్యాహ్నం పరీక్షకు 12216 మందికి గాను, 8776 మంది హాజరుకాగా, 3440 మంది గైర్హాజరయ్యారని వెల్లడించారు.
ఇక మిర్యాలగూడ పట్టణంలో ఏర్పాటు చేసిన 28 పరీక్ష కేంద్రాలకు మొత్తం 7798 మంది అభ్యర్థులను కేటాయించగా, ఉదయం పరీక్షకు 2,934 మంది హాజరు కాగా, 4864 మంది గైరహాజరయ్యారు. మధ్యాహ్నం పరీక్షకు మిర్యాలగూడ పట్టణంలో 7798కి గాను, 2930 మంది హాజరు కాగా, 4868 మంది గైర్హాజరైనట్లు కలెక్టర్ వెల్లడించారు.
మొత్తానికి మొదటి రోజు గ్రూప్-3 పరీక్ష లు జిల్లాలో రెండు పట్టణాలలో సవ్యంగా జరిగాయని, ఎలాంటి సంఘటనలు చోటు చేసుకోలేదని ఆమె తెలిపారు.
MOST READ :
-
Forest Jobs : రాత పరీక్ష లేకుండా అటవీ శాఖలో ఉద్యోగాలు.. నెలకు రూ.31 వేల వేతనం..!
-
Rythu : రైతులకు అదిరిపోయే న్యూస్.. రేపే ఖాతాలోకి డబ్బులు..!
-
Jobs : నిరుద్యోగులకు శుభవార్త.. టెన్త్ అర్హత ఉంటే చాలు.. కోర్టులో ఉద్యోగాలకు దరఖాస్తుల ఆహ్వానం..!
-
స్నేహితులే శత్రువులుగా.. వెంటాడి, వేటాడి కొట్టి చంపారు.. కారణం..!










