Miryalaguda : మిర్యాలగూడ ఏరియా ఆసుపత్రిలో ఐదు డయాలసిస్ మిషన్స్ ప్రారంభం..!
Miryalaguda : మిర్యాలగూడ ఏరియా ఆసుపత్రిలో ఐదు డయాలసిస్ మిషన్స్ ప్రారంభం..!
మిర్యాలగూడ, మన సాక్షి ;
మిర్యాలగూడ ఏరియా ఆసుపత్రి ని కార్పొరేట్ ఆసుపత్రులకు దీటుగా తీర్చిదిద్దుతానని నల్లగొండ పార్లమెంటు సభ్యులు కుందూరు రఘువీర్ రెడ్డి పేర్కొన్నారు.
గురువారం నల్గొండ జిల్లా మిర్యాలగూడ లోని ఏరియా ఆసుపత్రిలో నూతనంగా ఏర్పాటు చేసిన 5 డయాలసిస్ మిషన్స్ ని నల్గొండ ఎంపీ కుందూరు రఘువీర్ రెడ్డి, శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి, డిసిసి అధ్యక్షుడు కేతావత్ శంకర్ నాయక్ లు ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఎంపీ రఘువీర్ రెడ్డి మాట్లాడుతూ పార్లమెంట్ సమావేశాలు పూర్తవగానే హాస్పిటల్ అభివృద్ధికి అవసరమైన నిధులను మంజూరు చేస్తామని అన్నారు. మిర్యాలగూడలో ఇండస్ట్రీస్ అధికంగా ఉన్నందున ఇక్కడ ఈఎస్ఐ హాస్పిటల్ నీ ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తానన్నారు.
ఎమ్మెల్యే బిఎల్ఆర్ మాట్లాడుతూ ప్రతీ పేద మధ్య తరగతి కుటుంబాలకు మెరుగైన వైద్యం అందించాలనే లక్ష్యంతో మిర్యాలగూడ ఏరియా ఆసుపత్రినీ కార్పొరేట్ ఆసుపత్రులకు ధీటుగా తీర్చిదిద్ధాలని సంకల్పించాం అని అన్నారు.ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహని కోరిన వెంటనే స్పందించి డయాలసిస్ మిషన్స్ కి నిధులు మంజూరు చేసినందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.
అతి త్వరలోనే పలువురు దాతల సహకారంతో హాస్పటల్ లో కావాల్సిన మౌలిక వసతులు అన్నీ ఏర్పాటు చేస్తున్నామన్నారు.అదే విధంగా జిల్లా ఆసుపత్రికి ధీటుగా మిర్యాలగూడ ఆసుపత్రిని తీర్చిదిద్దేందుకు ఎంపీ కూడా తమ నిధుల నుంచి సహకారం అందించాలని కోరారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో మాట్లాడి మిర్యాలగూడలో మెడికల్ కళాశాల ఏర్పాటు చేసేందుకు కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు గాయం ఉపేందర్ రెడ్డి, నూకల వేణుగోపాల్ రెడ్డి, ముదిరెడ్డి నర్సిరెడ్డి, శాగ జయలక్ష్మి, జలంధర్ రెడ్డి, చిలుకూరి బాలు, దేశిడి శేఖర్ రెడ్డి, గోదాల జానకి రెడ్డి, మొల్లాల అమృత రెడ్డి, బంటు లక్ష్మీనారాయణ, తదితరులు పాల్గొన్నారు.
MOST READ :
-
TG News : సర్పంచ్ ఎన్నికలపై ప్రభుత్వం కీలక నిర్ణయం..!
-
Jobs Notification : తెలంగాణ డిసిసిబి లో ఉద్యోగాలు.. రాత పరీక్ష లేకుండా ఎంపిక, నెలకు రూ.25 వేల జీతం..!
-
Ration Cards : రేషన్ కార్డుదారులకు ప్రభుత్వం భారీ షాక్.. వారి రేషన్ కార్డులన్నీ రద్దు..!
-
TG News : తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం.. ఈవి పాలసీ, వారందరికీ ఉచితం..!









