Nalgonda : ఎన్ జి కళాశాల అభివృద్ధికి మంత్రి హామీ..!

Nalgonda : ఎన్ జి కళాశాల అభివృద్ధికి మంత్రి హామీ..!
నల్లగొండ , మన సాక్షి :
నాగార్జున ప్రభుత్వ గాకళాశాల అభివృద్ధికి ఇతోధికంగా సహకారం అందజేస్తానని రాష్ట్ర రోడ్లు, భవనాలు సినిమాటోగ్రఫి శాఖామాత్యులు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు. శుక్రవారం కళాశాలలో కోమటిరెడ్డి ప్రతీక్ ఫౌండేషన్ మంజూరు చేసిన ఆర్వో ప్లాంటును వాటర్ కూలర్లను ఆయన ప్రారంభించారు. అనంతరం జరిగిన సమావేశంలో మాట్లాడుతూ ప్రతిష్టాత్మాకమైన నాగార్జున ప్రభుత్వ కళాశాల అభివృద్ధికి సహకరిస్తానని హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమానికి గౌరవ అతిథిగా పాల్గొన్న రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్, సహకారం మరియు చేనేత శాఖమాత్యులు తుమ్మల నాగేశ్వర్ రావు మాట్లాడుతూ ప్రతీక్ ఫౌండషన్ నల్గొండ అభివృద్ధికి ఎంతో తోడ్పడుతుందని ప్రతీక్ ఫౌండేషన్ చేస్తోన్న అభివృద్ధి కార్యక్రమాలను అభినందించారు. నల్గొండ నియోజకవర్గ అభివృద్ధికి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి చేస్తోన్న కృషిని కొనియాడారు.
కార్యక్రమంలో పురపాలక సంఘం ఛైర్మెన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి, వైస్ ఛైర్మెన్ అబ్బాగోని రమేష్ గౌడ్ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాటి, ఎస్పీ శరత్ చంద్ర పవార్, ప్రతీక్ ఫౌండషన్ సిఇవో డా. గోనారెడ్డి, కళాశాల ప్రిన్సిపాల్ డా. ఎస్. ఉపేందర్, వైస్ ప్రిన్సిపాల్ డా. పిల్లి సురేష్ బాబు, డా. పరంగి రవి కుమార్, ఇతర అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.
LATEST UPDATE :
-
Nalgonda : రేవంతన్న పాటకు స్టెప్పులేసిన మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి..!
-
Thummala : రైతులకు గుడ్ న్యూస్ చెప్పిన మంత్రి తుమ్మల.. ఏ రోజుకు ఆ రోజే ధాన్యం కొనుగోలు..!
-
MLA Jaiveer : నిరుపేద కుటుంబానికి అండగా నిలిచిన ఎమ్మెల్యే జైవీర్..!
-
Miryalaguda : మున్సిపల్ సమావేశం బహిష్కరించిన కాంగ్రెస్ కౌన్సిలర్లు.. అవినీతి చైర్మన్ డౌన్ డౌన్ అంటూ నినాదాలు..!









