Breaking Newsజిల్లా వార్తలుతెలంగాణనల్గొండ
Miryalaguda : జిల్లా కలెక్టర్ సంచలన నిర్ణయం.. గురుకుల ప్రిన్సిపల్ సస్పెండ్, హాస్టల్ వార్డెన్ కు షోకాజ్..!
Miryalaguda : జిల్లా కలెక్టర్ సంచలన నిర్ణయం.. గురుకుల ప్రిన్సిపల్ సస్పెండ్, హాస్టల్ వార్డెన్ కు షోకాజ్..!
దామరచర్ల, మన సాక్షి :
నల్గొండ జిల్లా కలెక్టర్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. జిల్లాలోని మిర్యాలగూడ నియోజకవర్గం పరిధిలో ఉన్న దామరచర్ల గిరిజన గురుకుల బాలికల పాఠశాల ప్రిన్సిపల్ ను సస్పెండ్ చేస్తూ శుక్రవారం జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి ఉత్తర్వులు జారీ చేశారు.
విధుల పట్ల నిర్లక్ష్యం, అపరిశుభ్రమైన వంట పాత్రల వినియోగంపై జిల్లా కలెక్టర్ సీరియస్ అయ్యారు. గురుకుల పాఠశాలను జిల్లా కలెక్టర్ సందర్శించిన సందర్భంలో అపరిశుభ్రంగా ఉండడం చూసి ఆమె ఈ నిర్ణయం తీసుకున్నారు.
పాఠశాల ప్రిన్సిపల్ కవిత ను సస్పెండ్ చేస్తూ హాస్టల్ వార్డెన్ నసీర్ బేగం కు షోకాజ్ నోటీసు అందజేశారు. అదేవిధంగా పాఠశాల ఇన్చార్జి ప్రిన్సిపాల్ గా నాగవసంతను నియమించినట్లు డి సి ఓ లక్ష్మయ్య తెలిపారు.
MOST READ :









