Breaking Newsక్రైంతెలంగాణవైద్యంహైదరాబాద్

ACB : ఏసీబీ చరిత్రలో రికార్డు.. రూ. 600 కోట్ల అక్రమార్చన, వెనుక ఉన్నదెవరు..!

ACB : ఏసీబీ చరిత్రలో రికార్డు.. రూ. 600 కోట్ల అక్రమార్చన, వెనుక ఉన్నదెవరు..!

మన సాక్షి, తెలంగాణ బ్యూరో :

ఏసీబీ వలలో ఉన్న ఏఈఈ వ్యవహారం రాష్ట్ర వ్యాప్తంగా దుమారం లేపుతోంది. ఆ ఉద్యోగి 600 కోట్ల రూపాయల అక్రమార్చన ఎలా సంపాదించారనే వ్యవహారం రాష్ట్రవ్యాప్తంగా అందరి నోళ్ళలో నానుతోంది. ఏసీబీకి చిక్కిన అతిపెద్ద అనకొండ రాష్ట్ర ఏసీబీ చరిత్రలోనే ఇది రెండవ అతిపెద్ద కేసుగా చెబుతున్నారు ఏసీబీ అధికారులు.

గండిపేట మండలం పీరంచెరువు సిటీకేటెడ్ కమ్యూనిటీలోని నీటిపారుదల శాఖ అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ గా పనిచేస్తున్న నికేష్ గతంలో ఏసీబీ అధికారులకు చిక్కాడు. కాగా ఆయన అక్రమార్జన విషయంపై అధికారులు సోదాలు నిర్వహించగా అధికారులకే కళ్ళు బైర్లు కమ్ముతున్నాయి.

నికేష్ నివాసంతో పాటు ఆయన బంధువులు స్నేహితుల ఇళ్లలో కూడా సోదాలో నిర్వహించారు. దాంతో భారీగా బంగారం, నగదు, ఇళ్ల స్థలాలు, వ్యవసాయ భూముల డాక్యుమెంట్లు కూడా లభించాయి. సుమారు 600 కోట్ల రూపాయల వరకు అక్రమార్చన ఉన్నట్లుగా అధికారులు భావిస్తున్నారు.

అయితే అంత పెద్ద మొత్తంలో నికేష్ కుమార్ ఎలా అక్రమార్జన చేశాడంటే.. బఫర్ జోన్లలో నిర్మాణ పనులకు అనుమతులు ఇవ్వడంలో ఇతడు సిద్ధహస్తుడు. ఎక్కడైనా ఏదైనా ల్యాండ్, చెరువు అలాంటి ప్రదేశాలలో వివాదం ఉంటే అందులో కలుగజేసుకొని అనుమతులు ఇప్పించి భారీగా ముడుపులు తీసుకోవడం ఇతనికి అలవాటుగా మారింది అనేది ప్రచారం.

నానక్ రామ్ గూడ, శంషాబాద్, గచ్చిబౌలిలోని విల్లాలు, నార్సింగిలో విల్లాలు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. వాసవి అట్లాంటిస్, మైరాన్ విల్లా శంషాబాద్, సాస్ గచ్చిబౌలి, రాయి చాందిని లో ఖరీదైన విల్లాలున్నట్లు గుర్తించారు.

నార్సింగిలో నాలుగు అంతస్తుల హాస్టల్ భవనం, మొయినాబాద్ లో ఆరు ఎకరాల్లో మూడు ఫామ్ హౌజ్ లు, తాండూరులో మూడు ఎకరాల వ్యవసాయ భూమి ఉన్నట్లు గుర్తించారు. అదేవిధంగా బినామీలకు చెందిన ఏడు లాకర్లను కూడా ఏసీబీ అధికారులు గుర్తించారు.

అయితే ఇంత పెద్ద అక్రమాస్తుల సంపాదన ఎలా వచ్చిందనేది అధికారులు ఆరా తీస్తున్నారు. ఇప్పటివరకు దేవిక రాణి తర్వాత రెండవ స్థానంలో నికేష్ కుమార్ ఉన్నట్లు ACB అధికారులు పేర్కొంటున్నారు.

గత పది సంవత్సరాల కాలంలోనే నికేష్ కుమార్ ఇంత భారీ మొత్తంలో అక్రమార్చన సంపాదించడం వెనుక ఇంకా ఎవరైనారా..? ఉన్నతాధికారులు గాని, రాజకీయ నాయకులు కానీ ఉన్నారా..? అని అధికారులు ఆరాధిస్తున్నారు.

MOST READ : 

మరిన్ని వార్తలు