CM Revanth, Thalasani : సీఎం రేవంత్ రెడ్డి ని కలిసిన మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్..!
CM Revanth, Thalasani : సీఎం రేవంత్ రెడ్డి ని కలిసిన మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్..!
మన సాక్షి, హైదరాబాద్ :
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని సనత్ నగర్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మంగళవారం కలిశారు. రేవంత్ రెడ్డిని ఆయన నివాసంలో తన సోదరుడి కుమార్తె వివాహానికి రావాల్సిందిగా ముఖ్యమంత్రి కి శుభలేఖ అందజేశారు.
కొద్ది రోజుల క్రితం మాజీ మంత్రి మల్లారెడ్డి కూడా తన మనవరాలు పెళ్ళికి రేవంత్ రెడ్డిని ఆహ్వానించారు. రేవంత్ రెడ్డిని తలసాని శ్రీనివాస్ యాదవ్ కలవటం హాట్ టాపిక్ గా మారింది. ఇదిలా ఉండగా కొన్ని రోజుల క్రితం పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ రాజకీయాలపై కీలక వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే.
గ్రేటర్ హైదరాబాద్ కు చెందిన కొంతమంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ తో టచ్ లో ఉన్నారని చెప్పిన విషయం తెలిసిందే. కానీ బీఆర్ఎస్ వర్గాల్లో ఆందోళన వ్యక్తం అవుతుంది. అయినా కాంగ్రెస్ లో ఎలాంటి చేరికలు జరగలేదు.
ఇదిలా ఉండగా పార్టీ ఫిరాయింపుదారుల విషయంపై హైకోర్టు కు వెళ్లినా.. స్పీకర్ దే ఫైనల్ అని చెప్పడంతో మరోసారి ఫిరాయింపులు ఊపు అందుకునే అవకాశం కనిపిస్తుంది. మరో ముగ్గురు ఎమ్మెల్యేలు పార్టీ మారతారని కాంగ్రెస్ పార్టీలో చేరుతారని ప్రచారం జోరుగా సాగుతుంది.
MOST READ :









