Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsక్రైంజిల్లా వార్తలుతెలంగాణనల్గొండ

Miryalaguda : ట్రాక్టర్ ఢీకొన్న కారు.. ప్రమాదంలో వ్యక్తి మృతి..!

Miryalaguda : ట్రాక్టర్ ఢీకొన్న కారు.. ప్రమాదంలో వ్యక్తి మృతి..!

మిర్యాలగూడ, మన సాక్షి :

ట్రాక్టర్ ను వెనుక నుంచి కారు ఢీకొన్న సంఘటనలో వ్యక్తి మృతి చెందారు. ఈ సంఘటన మిర్యాలగూడ మండలం గూడూరు సమీపంలో బుధవారం చోటుచేసుకుంది. మిర్యాలగూడ రూరల్ ఎస్సై తెలిపిన వివరాల ప్రకారం.. హైదరాబాదు నుండి గుంటూరు వైపు కారులో గుంటూరుకు చెందిన షేక్ నజీర్, నాగభైరవు వీర సీతరామరాజు వెళ్తున్నారు.

కాగా మిర్యాలగూడ మండలం గూడూరు శివారులోని కీర్తి రైస్ మిల్లు వద్దకు రాగానే కారు ముందు వెళ్తున్న ట్రాక్టర్ ఒక్కసారిగా ఎడమ పక్కకు తిప్పడంతో కారు ఢీ కొట్టింది. కారులో డ్రైవర్ పక్క సీట్లో కూర్చున్న షేక్ నజీర్ (42) కు గాయాలు కావడంతో మిర్యాలగూడ ఏరియా ఆసుపత్రికి తరలించారు.

కాగా మెరుగైన చికిత్స కోసం నలగొండ తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందాడు. మృతుడు షేక్ నజీర్ తండ్రి నాగుల్ మీరా ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై పేర్కొన్నారు. మృతునికి ఒక భార్య ఇద్దరు కూతుళ్లు ఉన్నారు.

MOST READ : 

మరిన్ని వార్తలు