Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
తెలంగాణBreaking Newsజిల్లా వార్తలునల్గొండ

Miryalaguda : విద్యార్థులకు పౌష్టికాహారం అందించకుంటే క్షమించేది లేదు.. ఎమ్మెల్యే బిఎల్ఆర్ ఆదేశం..!

Miryalaguda : విద్యార్థులకు పౌష్టికాహారం అందించకుంటే క్షమించేది లేదు.. ఎమ్మెల్యే బిఎల్ఆర్ ఆదేశం..!

మిర్యాలగూడ, మన సాక్షి :

గురుకులాలు, ప్రభుత్వ హాస్టల్స్ లో సరైన పౌష్టికాహారం అందించాలని, లేకుంటే చర్యలు తీసుకోవాలని మిర్యాలగూడ శాసనసభ్యులు భత్తుల లక్ష్మారెడ్డి అధికారులను ఆదేశించారు. బుధవారం మిర్యాలగూడలోని సబ్ కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు.

గురుకుల పాఠశాలలో, కళాశాలలో, ప్రభుత్వ హాస్టల్స్ లో విద్యార్థులకు సరైన పౌష్టికాహారం అందించాలన్నారు. అదేవిధంగా పాఠశాలల ఆవరణ పరిశుభ్రంగా ఉండాలని ఆదేశించారు.
అందుకుగాను ప్రత్యేక కమిటీలను ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని అధికారులకు ఆదేశించారు.

విద్యార్థులకు సరైన పౌష్టిక ఆహారం అందించకపోయినా పరిసరాలు శుభ్రంగా లేకపోయినా.. నిర్వహకులపై వెంటనే చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. సమావేశంలో సబ్ కలెక్టర్ నారాయణ్ అమిత్, తహసిల్దార్ హరిబాబు, మండల విద్యాధికారి బాలు నాయక్, గురుకుల పాఠశాలల ప్రిన్సిపల్ హాస్టల్స్ నిర్వహకులు తదితరులు పాల్గొన్నారు.

MOST READ : 

మరిన్ని వార్తలు