తెలంగాణBreaking Newsజిల్లా వార్తలునల్గొండవిద్య
Miryalaguda : సైన్స్ టాలెంట్ టెస్టులో ఎస్ వి మోడల్ హై స్కూల్ విద్యార్థుల ప్రతిభ..!
Miryalaguda : సైన్స్ టాలెంట్ టెస్టులో ఎస్ వి మోడల్ హై స్కూల్ విద్యార్థుల ప్రతిభ..!
మిర్యాలగూడ, మన సాక్షి :
నల్గొండ జిల్లా మిర్యాలగూడ లో అల్లం కిరణ్ మెమోరియల్ ఆధ్వర్యంలో నిర్వహించిన సైన్స్ టాలెంట్ టెస్ట్ లో మిర్యాలగూడకు చెందిన ఎస్ వి మోడల్ స్కూల్ విద్యార్థులు ప్రతిభ కనబరిచారు. వ్యాసరచన పోటీలలో నవ్య శ్రీ, నిహారిక, సైన్స్ టాలెంట్ లో ఓరుగంటి పార్ధు శశాంక్ కుమార్, ఝాన్సీ, శ్రావణి లకు బహుమతులు అందజేశారు.
ఈ సందర్భంగా ప్రతిభ కనబరిచిన విద్యార్థులను హై స్కూల్ లో కరస్పాండెంట్ ఓరుగంటి శ్యాంసుందర్ అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల డైరెక్టర్ ఓరుగంటి విశాలాక్ష్మి, ఇంచార్జ్ నాగలక్ష్మి లతో పాటు ఉపాధ్యాయ బృందం పాల్గొన్నారు.
MOST READ :









