Breaking Newsక్రైంజిల్లా వార్తలుతెలంగాణసంగారెడ్డి జిల్లా

BREAKING : సంగారెడ్డి జిల్లాలో పట్టపగలే దొంగల హల్ చల్..!

BREAKING : సంగారెడ్డి జిల్లాలో పట్టపగలే దొంగల హల్ చల్..!

కంగ్టి, మన సాక్షి :

పట్టపగలే అంగన్వాడీ టీచర్ ఇంట్లో దొంగతనం జరిగింది ఘటన సంగారెడ్డి జిల్లా కంగ్టి మండలంలోని దెగుల్ వాడి గ్రామంలో చోటు చేసుకుంది. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం దెగుల్ వాడిలో అంగన్వాడీ టీచర్ రమాదేవి ఇంట్లో సోమవారం మధ్యాహ్నం ఇంట్లో ఎవరు లేని సమయంలో ఇంట్లో దొంగలు పడ్డారు.

పొలానికి వెళ్లి ఇంటికి తిరిగి వచ్చేసరికి ఇంటి తాళం పగలగొట్ట ఉంది. ఇంట్లో ఉన్న ఒక లక్ష రూపాయల నగదు, ఐదు తులాల బంగారం దొంగిలించరాని బాధితులు తెలిపారు. ఇంట్లోని వస్తువులు మొత్తం చిందరవందరగా చేసి వెళ్లిపోయారని అన్నారు. స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. కుమారుడు ధనరాజ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై విజయ్ కుమార్ తెలిపారు.

MOST READ : 

మరిన్ని వార్తలు