District collector : ఇందిరమ్మ ఇళ్ల సర్వే.. స్వయంగా రిశీలించిన జిల్లా కలెక్టర్..!
District collector : ఇందిరమ్మ ఇళ్ల సర్వే.. స్వయంగా రిశీలించిన జిల్లా కలెక్టర్..!
మల్లాపూర్, మన సాక్షి :
జగిత్యాల జిల్లాలో ఇందిరమ్మ ఇండ్ల సర్వే లో ఎలాంటి అవాంతరాలకు తావు లేకుండా పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ బి. సత్య ప్రసాద్ తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇండ్లను మంగళవారం మల్లాపూర్ మండలంలో సాతారం గ్రామంలో పలు వార్డు లో ఇళ్లులేని నిరు పేదలు సమర్పించిన దరఖాస్తుల ఆధారంగా సర్వే సిబ్బంది చేస్తున్న ఇంటింటి సర్వేను తనిఖీ చేశారు.
యాప్ ద్వారా సర్వే చేపట్టాలని సూచిం చారు. ఇందిరమ్మ పథకం కింద పూర్తిస్థాయి అర్హత గల నిరుపేద కుటుం బాలకు ఇళ్లను అందజేసే లక్ష్యంతో సర్వే చేయాలని తెలిపారు. జిల్లాలో ఇళ్ల కోసం దరఖాస్తు చేసుకున్న ప్రజ పాలన దరఖాస్తు ఆధారంగా నిరుపేదను గుర్తించి ఇందిరమ్మ ఇండ్ల ను మంజూరు చేస్తావని తెలిపారు. సాతారం గ్రామంలో సర్వే చేసిన సరళిని పరిశీలించారు.
అనంతరం లబ్ధిదారులు యొక్క వివరాలను యాప్ ద్వారా పొందుపరుస్తున్న వివరాల నమోదు ల్యాండ్ డాక్యుమెండను ప్లాటును స్వయంగా పరిశీలించి కలెక్టరు దగ్గర ఉండి వివరాలను నమోదు వేగవంతంగా చేయాలని ఆదేశించారు. కలెక్టర్ వెంట, మెట్పల్లి ఆర్డీవో శ్రీనివాస్ హౌసింగ్ ఇఇ, రాజేశ్వర్, ఈ ఈ పి ఆర్ అబ్దుల్ రెహమన్ తహసిల్దార్, ఎంపీడీవో, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.
మరిన్ని వార్తలు :
-
District collector : ఆఫీస్ అంతా ఖాళీ.. జిల్లా కలెక్టర్ ఆశ్చర్యం, అసలేం జరిగింది..!
-
District collector : డిసెంబర్ 25 లోపు ఇందిరమ్మ ఇండ్ల సర్వే పూర్తి చేయాలి.. జిల్లా కలెక్టర్ ఆదేశం..!
-
TG News : ముగిసిన తెలంగాణ కేబినెట్ భేటీ.. రైతు భరోసా పై సీఎం రేవంత్ ఆదేశాలు..!
-
PrajaPalana : ఇందిరమ్మ ఇండ్లు, ఉచిత విద్యుత్, రూ.500 వంటగ్యాస్.. మళ్లీ ప్రజా పాలన దరఖాస్తులకు అవకాశం..!









