Breaking Newsక్రైంజిల్లా వార్తలుతెలంగాణనల్గొండ

Miryalaguda : పాయిజన్ టాబ్లెట్లు వేసుకుని యువకుడు ఆత్మహత్య..!

Miryalaguda : పాయిజన్ టాబ్లెట్లు వేసుకుని యువకుడు ఆత్మహత్య..!

మిర్యాలగూడ, మన సాక్షి :

పాయిజన్ టాబ్లెట్లు వేసుకుని యువకుడు ఆత్మహత్య చేసుకున్న సంఘటన మిర్యాలగూడ మండలంలోని బాధలాపురంలో చోటుచేసుకుంది. రూరల్ ఎస్సై తెలిపిన వివరాల ప్రకారం.. కన్నెగంటి రాకేష్ (24) బాదలాపురం గ్రామంలో రైస్ మిల్లులో గుమస్తాగా పనిచేస్తుంటాడు.

ఈనెల 16వ తేదీన రైస్ మిల్లుకు వెళ్లి మధ్యాహ్నం సమయంలో మిల్లు నుండి తిరిగి వచ్చినా ఇంటికి వెళ్ళలేదు. గూడూరు సమీపంలోని ఓపెన్ స్థలంలో మద్యం సేవించి అదే మత్తులో ఎలుకల నివారణకు వాడే పాయిజన్ టాబ్లెట్లు సేవించాడు. దాంతో అక్కడికక్కడే మృతి చెందాడు.

కాగా మంగళవారం ఉదయం మృతుడిని వెతుకుతున్న గ్రామంలో మృతదేహం లభ్యమయింది. కాగా మృతుడి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. మృతుడికి వివాహం కాలేదు.

MOST READ : 

మరిన్ని వార్తలు