Miryalaguda : రావణ నాటకానికి నాలుగు అవార్డులు..!
Miryalaguda : రావణ నాటకానికి నాలుగు అవార్డులు..!
మిర్యాలగూడ, మన సాక్షి:
శివాని ఆర్ట్స్ అసోసియేషన్ హైదరాబాద్ వారి ఆహ్వాన పద్య నాటిక పోటీలు ఈనెల 12 నుండి 20వ తారీకు వరకు 9 రోజులు శ్రీ భావనపల్లి పరమేష్ మరియు పాండవుల హరిప్రసాద్ ఆధ్వర్యంలో నిర్వహణ జరిగింది. మిర్యాలగూడ సాంస్కృతిక కళా కేంద్రం అధ్యక్ష కార్యదర్శులు బోయినపల్లి భుజంగరావు పులి కృష్ణమూర్తి శర్మ ఆదివారం జరిగిన సమావేశంలో మాట్లాడుతూ…
ఈ నెల 13వ తారీఖున మిర్యాలగూడ సాంస్కృతిక కళా కేంద్రం వారు పై వారి ఆహ్వానం మేరకు “రావణ” పద్య నాటకం ప్రదర్శించడం జరిగింది.పై నాటకోత్సవాలలో భాగంగా 20వ తారీఖున బహుమతి ప్రధానోత్సవంలో “రావణ” నాటకానికి నాలుగు బహుమతులు ఉత్తమ జ్యూరీ అవార్డు ప్రకటించారు.
ఉత్తమ నటుడిగా బోయినపల్లి భుజంగరావు, ఉత్తమ సహాయ నటులుగా పుల్లాభట్ల వెంకటలక్ష్మీ నారాయణశర్మ, ఉత్తమ సంగీతం సురభి కొండలరావు, వ్యక్తిగత ఉత్తమ జ్యూరీగా కంబాల శ్రీనివాస్ మరియు ఉత్తమ జ్యూరీ నాటకం రావణగా బహుమతులు పొందారు.
ఈ బహుమతులు నాటిక సమాజాల సమాఖ్య వ్యవస్థాపకులు తడకమళ్ళ రామచందర్ రావు, అధ్యక్షులు ఆకుల సదానందం, పాండవుల హరిప్రసాద్, పరమేశం చేతుల మీదుగా అందుకోవడం ఎంతో సంతోషాన్ని మాకు అందించిందని వారు తెలిపారు.
MOST READ :
-
UPI : గూగుల్ పే ఫోన్ పే వాడుతున్నారా.. అయితే జనవరి కొత్త రూల్స్, తప్పక తెలుసుకోవాల్సిందే..!
-
Rythu Bharosa : రైతు భరోసా పై మంత్రి తుమ్మల క్లారిటీ.. ఒక్క రైతును కూడా తగ్గించం.. లేటెస్ట్ అప్డేట్..!
-
TG News : రైతులకు అదిరిపోయే శుభవార్త.. మరో కొత్త పథకం ప్రారంభం..!
-
Miryalaguda : పీడీఎస్ బియ్యం, గంజాయి అక్రమ రవాణా పై నిరంతరం నిఘ పెట్టాలి.. ఐజి సత్య నారాయణ ఆదేశం..!









