Miryalaguda : ట్రాఫిక్ నియంత్రణకు ఊరు.. ఊరంతా కదిలారు.. ఎమ్మెల్యే బిఎల్ఆర్ వినూత్న కార్యక్రమం..!
Miryalaguda : ట్రాఫిక్ నియంత్రణకు ఊరు.. ఊరంతా కదిలారు.. ఎమ్మెల్యే బిఎల్ఆర్ వినూత్న కార్యక్రమం..!
మిర్యాలగూడ, మన సాక్షి :
నల్గొండ జిల్లా మిర్యాలగూడలో ఏళ్ల తరబడిగా ట్రాఫిక్ సమస్య ఉంది ఇక్కడ ఒకటే ప్రధాన రహదారి ఉండడంతో ట్రాఫిక్ చిక్కులు తప్పడం లేదు. స్థానిక శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి ఆధ్వర్యంలో ట్రాఫిక్ నియంత్రణకు వినూతల కార్యక్రమం చేపట్టారు. నియోజకవర్గ వ్యాప్తంగా ప్రజల నుంచి హర్షం వ్యక్తం అవుతుంది.
అందరం కలిసి బాధ్యతగా ఉంటేనే ప్రతి సమస్యను పరిష్కరించుకోవచ్చునని మిర్యాలగూడ శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి అన్నారు. సోమవారం మిర్యాలగూడలో మున్సిపాలిటీ, పోలీసు శాఖ ప్రజాప్రతినిధులు స్వచ్ఛంద సంస్థలు ఆధ్వర్యంలో ఆధ్వర్యంలో పట్టణంలో అధికంగా పెరిగిపోతున్న ట్రాఫిక్ సమస్యని నియంత్రించేందుకు
వ్యాపారస్తులకు, షాపింగ్ మాల్స్ కి, ప్రజలకు, ప్రయాణికులకు ట్రాఫిక్ నియంత్రణపై అవగాహన కల్పించారు.
పట్టణంలోని ఫ్లైఓవర్ నుంచి బస్టాండ్, డాక్టర్స్ కాలని, గణేష్ మార్కెట్, పెద్ద బజార్ గుండా రాజీవ్ చౌక్ మీదుగా తిరిగి బస్టాండ్ వరకు ట్రాఫిక్ నియంత్రణ అవగాహన ర్యాలి నిర్వహించడం జరిగింది.
ఈ సంద్భంగా వారు మాట్లాడుతూ మిర్యాలగూడ నియోజకవర్గంలో రోజు రోజుకు జనాభా, వ్యాపార సంస్థలు పెరుగుతున్నప్పటికి పెరుగుతున్న జనాభా ప్రకారం కావాల్సిన వసతులు మాత్రం గత 20 సంవత్సరాలుగా ఏమాత్రం మారలేదు అని అన్నారు.
మిర్యాలగూడ పట్టణంలో ఒకే ఒక్క ప్రధాన రహదారి ఉండటం మూలాన, వ్యాపార సంస్థలు అన్ని ఒకే రోడ్డుపై ఉండటం మూలాన రోజు రోజుకు ట్రాఫిక్ సమస్య అధికమవుతుంది అని అన్నారు.
గత వైఫల్యాల గురించి చర్చించుకోవడం మానేసి సమస్య పరిష్కారం కోసం మనం చేయాల్సిన కార్యాచరణ ఏంటి అని ఆలోచించాలన్నారు.
గత నెల రోజులుగా ప్రతీ రోజూ రోడ్డుపై ఉన్న వ్యాపారస్తులకు , ప్రజలకు తగు సూచనలు చేస్తూ పోలీస్ అధికారులు, మున్సిపల్ అధికారులు శ్రమిస్తూ ఉన్నారన్నారు. కేవలం ప్రజా ప్రతినిధులను, అధికారులను సామాజిక మాధ్యమాల్లో ప్రశ్నించడం, విమర్శించడం కాకుండా తమ వంతు బాధ్యతగా ప్రతీ పౌరుడు సామాజిక బాధ్యతతో వ్యవహరిస్తూ ట్రాఫిక్ నియంత్రణకు కృషి చేస్తూ పరిష్కారం వెతకాలి అని అన్నారు.
అందరం బాధ్యతతో కలసి పనిచేస్తేనే ఈ సమస్యకి పూర్తి పరిష్కారం జరుగుతుంది అని అన్నారు.
ట్రాఫిక్ నియంత్రణ కోసం మేము చేస్తున్న ఈ కార్యక్రమాలు , మేము తీసుకుంటున్న ఈ నిర్ణయాలు వ్యాపారులను, ప్రజలను తాత్కాలికంగా కొంచెం ఇబ్బంది పెట్టినా.. దీని ఫలితం భవిష్యత్తులో తెలుస్తుంది అన్నారు. ఇప్పుడు నన్ను విమర్శించినా పర్వాలేదు కానీ భవిష్యత్తులో నేను తీసుకున్న నిర్ణయాన్ని మీరే అభినందిస్తారు అని అన్నారు.
ప్రజలు, ప్రయాణికులు, వ్యాపారులు ప్రతిఒక్కరూ అధికారులకు సహకరించండి అందరం కలిసి ట్రాఫిక్ సమస్యని సునాయాసంగా పరిష్కరించగలం అనే సందేశాన్ని పంపేందుకే ఈ రోజు ఈ అవగాహన ర్యాలీ నిర్వహించాము అని అన్నారు.
ఈ కార్యక్రమంలో డి.ఎస్.పి రాజశేఖర్ రాజు, రైస్ మిల్లర్స్ అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు కర్నాటి రమేష్, డిసిసి కార్యదర్శి చిలుకూరి బాలు కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు నూకల వేణుగోపాల్ రెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు పొదిల శ్రీనివాస్, కాంగ్రెస్ పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు శాగ జలంధర్ రెడ్డి , ముదిరెడ్డి నర్సిరెడ్డి, రుణాల్ రెడ్డి, చల్ల అంజిరెడ్డి, గంధం రామకృష్ణ, బలుగురు శ్రీనివాస్, మొల్లాల అమృత రెడ్డి, దేశిడి శేఖర్ రెడ్డి , గోదాల జానకి రామ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
MOST READ :
-
UPI : గూగుల్ పే ఫోన్ పే వాడుతున్నారా.. అయితే జనవరి కొత్త రూల్స్, తప్పక తెలుసుకోవాల్సిందే..!
-
Pass Book : రైతులకు కొత్త పట్టాదారు పాస్ పుస్తకాలు.. ప్రతి యజమానికి భూధార్ నెంబర్..!
-
Rythu Bharosa : రైతు భరోసా పై మంత్రి తుమ్మల క్లారిటీ.. ఒక్క రైతును కూడా తగ్గించం.. లేటెస్ట్ అప్డేట్..!
-
TG News : రైతులకు అదిరిపోయే శుభవార్త.. మరో కొత్త పథకం ప్రారంభం..!











