Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsజిల్లా వార్తలుతెలంగాణనల్గొండ

Miryalaguda : అక్రమ నిర్మాణాల కూల్చివేత..!

Miryalaguda : అక్రమ నిర్మాణాల కూల్చివేత..!

మిర్యాలగూడ, మన సాక్షి :

నల్గొండ జిల్లా మిర్యాలగూడ మున్సిపాలిటీలో టాస్క్ ఫోర్స్ అధికారులు అక్రమ నిర్మాణాలను కూల్చివేశారు. సాగర్ రోడ్డులో అనుమతి లేకుండా నిర్మించిన ఫుట్వేర్ షాపులను జిల్లా టాస్క్ఫోర్స్ అధికారులు శనివారం కూల్చివేశారు. అనంతరం సబ్ కలెక్టర్ నారాయణ్ అమిత్ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.

కొన్ని సంవత్సరాలుగా ప్రభుత్వ భూములు ఆక్రమణలు, అక్రమ నిర్మాణాలు కొనసాగుతున్నట్లు తన దృష్టికి వచ్చిందని తెలిపారు. అక్రమ నిర్మాణాల జాబితాను మున్సిపల్ కమిషనర్ సిద్ధం చేశారని, దశలవారీగా కూల్చివేతల ప్రక్రియను చేపడుతున్నట్లు ఆయన పేర్కొన్నారు. అదేవిధంగా సర్వేనెంబర్ 992లో చేపట్టిన ఫుట్వేర్ ట్రేడ్ లైసెన్సు లేదని, ఆ భూమి గ్రామకంఠంగా 1960 లోనే నిర్ధారించినట్లు ఆయన తెలిపారు.

నిర్మాణం అక్రమ కట్టడం అని గతంలో నోటీసులు ఇచ్చినప్పటికీ ఎలాంటి స్పందన రాకపోవడంతో కూల్చివేసినట్లు తెలిపారు. అక్రమ బిజినెస్ చేస్తూ అక్రమాలకు పాల్పడే వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకుంటామని, ఇన్కమ్ టాక్స్, జీఎస్టీ, కమర్షియల్ టాక్స్ శాఖలకు కూడా రిఫర్ చేసినట్లు తెలియజేశారు. గతంలో నోటీసు జారీ చేశామని కోర్టు ఆర్డర్ ప్రకారమే కూల్చివేసినట్లు తెలిపారు . సమావేశంలో మున్సిపల్ కమిషనర్ యూసఫ్, తహసిల్దార్ హరిబాబు ఉన్నారు.

MOST READ : 

మరిన్ని వార్తలు