TOP STORIESBreaking Newsవ్యవసాయం

Good News : రైతులకు భారీ గుడ్‌ న్యూస్‌.. రూ.3 లక్షల లోన్.. రూ.50 వేల ఉచిత ఇన్సూరెన్స్..!

Good News : రైతులకు భారీ గుడ్‌ న్యూస్‌.. రూ.3 లక్షల లోన్.. రూ.50 వేల ఉచిత ఇన్సూరెన్స్..!

 

మన సాక్షి:

రైతులు అదనుకు పంట వెయ్యాలంటే.. ఖర్చులకు డబ్బులు లేకపోతే.. చాలా కష్టం. పెట్టుబడి లేకపోతే వ్యవసాయం చెయ్యలేరు రైతులు. దుక్కి దన్నేందుకు, కూలీలకు, ఎరువులకు, పురుగుల మందులకు…అన్నింటికీ డబ్బే అవసరం.

సమయానికి డబ్బులేకపోతే.. బయట తీసుకుంటే..వడ్డీలకే సరిపోతుంది. ఇది పేద రైతులకు తలకు మించిన భారం. ఇలాంటి వారికోసమే…కేంద్ర సర్కార్ కిసాన్ క్రెడిట్‌ కార్డు అందిస్తోంది. ఈ కార్డుతో 3 లక్షల రూపాయలు రైతులు తమ అవసరానికి తీసుకోవచ్చు. పంట వచ్చిన తర్వాత ఆ డబ్బును తీరిగి చెల్లించవచ్చు.

కిసాన్ క్రెటిట్‌ కార్డు ద్వారా పొందే రుణానికి వడ్డీ కూడా చాలా తక్కువ. ఈ డబ్బును ఏటీఎంలలో అవసరమొచ్చినప్పుడు తీసుకోవచ్చు. కిసాన్‌ క్రెడిట్‌ కార్డు కోసం మీ బ్యాంకులో సంప్రదించండి. లేదంటే ఆన్‌లైన్‌లోనూ అప్లై చేసుకోవచ్చు. అన్నట్టు కిసాన్‌ క్రెడిట్‌ కార్డు ఉన్న రైతులకు 50 వేల రూపాయల ఇన్సురెన్స్‌ కూడా ఉంటుంది.

Reporting : MahipalReddy, Hyderabad

MOST READ :

మరిన్ని వార్తలు