TOP STORIESBreaking Newsజాతీయం

Gold Price : బంగారు ఆభరణాలు ఇక చౌక.. కేంద్రం సంచలన నిర్ణయం..!

Gold Price : బంగారు ఆభరణాలు ఇక చౌక.. కేంద్రం సంచలన నిర్ణయం..!

మన సాక్షి, వెబ్ డెస్క్ :

బంగారం ధరలు రోజురోజుకు ఆకాశాన్ని అంటుతున్నాయి. సామాన్య ప్రజలు బంగారు ఆభరణాలు కొనుగోలు చేయలేని పరిస్థితి నెలకొన్నది. సామాన్యులకు కూడా బంగారు ఆభరణాలు చేరువయ్యే విధంగా కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకోనున్నది.

కేంద్ర నిర్ణయంతో సామాన్యులకు ఊరట కలిగించవచ్చునని ఆర్థిక విశ్లేషకులు భావిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వ బడ్జెట్ తర్వాత బంగార బంగారు ఆభరణాలు మరింత చౌకగా మారే అవకాశం ఉంటుందని పేర్కొంటున్నారు. బంగారు ఆభరణాలు చౌకగా లభించే విధంగా కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకోన్నట్లు తెలుస్తుంది.

ఫిబ్రవరి 1వ తేదీన ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. ఈ నేపథ్యంలో బంగారం ధర తగ్గుతుందని హాట్ టాపిక్ గా మారింది. బంగారం ఆభరణాలపై విధించే పన్ను విధానంపై ప్రభుత్వానికి పలు అభ్యర్థనలు వెళ్తున్నాయి. వ్యాపారానికి మద్దతుగా ఉండే విధంగా పన్నుల హేతుబద్ధీకరణ జరగాలని ఆల్ ఇండియా జెమ్ అండ్ జ్యువెలరీ డొమెస్టిక్ కౌన్సిల్ (GJC) చైర్మన్ రాజేష్ రోక్డే పేర్కొన్నారు.

నిరంతరంగా పెరుగుతున్న బంగారం ధరలతో ప్రస్తుత జిఎస్టి రేటు, ఇటు పరిశ్రమలకు అటు సగటు వినియోగదారుడికి భారంగా మారుతుందని ఆయన పేర్కొన్నారు. దాంతో రాబోయే బడ్జెట్ లో జిఎస్టి ప్రస్తుత 3 శాతం నుండి 1 శాతానికి తగ్గించాలని జిజేసి విజ్ఞప్తి చేయనున్నది.

ఇదే జరిగితే పన్ను తగ్గింపు వల్ల బంగారు ఆభరణాలకు ధరలు తగ్గే అవకాశం ఉంది. దాంతో గ్రామీణ ప్రాంతాల్లో వినియోగదారులు కూడా కొనుగోలు చేసే స్తోమత పెరగనున్నది. జిఎస్టి తగ్గడం ద్వారా మధ్యతరగతి వర్గాల వారికి ఎంతో ఊరట కలగనున్నది. బంగారం ధరలు చౌకగా లభించనున్నాయి.

RELEATED NEWS :

మరిన్ని వార్తలు