Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
తెలంగాణBreaking Newsజిల్లా వార్తలునల్గొండ

Devarakonda : జాతీయ రహదారిపై పొద్దెక్కినా.. కురుస్తున్న మంచు..!

Devarakonda : జాతీయ రహదారిపై పొద్దెక్కినా.. కురుస్తున్న మంచు..!

దేవరకొండ, మనసాక్షి :

పొద్దుగూకితే చలిదెబ్బకి సతమతం.. మళ్లీ వేకువజాము నుంచే పొగమంచుకు ఎముకలు కొరికే చలి.. కనుచూపు మేరలో నేలనంతా మంచుదుప్పటి కప్పేస్తున్నది. ఉదయం 8 గంటల వరకు మంచుతెర తొలగడం లేదు. మంగళవారం నల్లగొండ జిల్లాలోని దేవరకొండ పట్టణంలో, విపరీతంగా మంచుకురిసింది. కమ్ముకున్న మంచు కారణంగా రహదారులు కనిపించక వాహనదారులు లైట్లు వేసుకుని ప్రయాణించారు.

జాతీయ రహదారిపై వాహనాలు లైట్లు వేసుకుని వెళ్లాల్సి వచ్చింది.పొలాలు, రోడ్లను మంచు కప్పేసింది. పొలాల వద్దకు వెళ్లే రైతులు అవస్థలు పడ్డారు. రోడ్లను పూర్తిగా మంచు కప్పేయడంతో వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఎదురుగా వచ్చే వాహనాలు కనిపించక లైట్లు వేసుకుని వెళ్లారు. కొందరు వాహనదారులైతే రోడ్డు పక్కన వాహనాలను నిలుపుకొని మంచు తగ్గాక వెళ్లడం కనిపించింది.

MOST READ : 

మరిన్ని వార్తలు