Nalgonda : నల్గొండ లో భోగి పండుగ వేడుకలు..!
Nalgonda : నల్గొండ లో భోగి పండుగ వేడుకలు..!
నల్లగొండ, మనసాక్షి :
భోగి పండుగ సందర్భంగా సోమవారం నల్గొండ మాజీ శాసనసభ్యులు కంచర్ల భూపాల్ రెడ్డి నివాసం వద్ద భోగి వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. భోగి మంటలు వేసి ఉత్సాహంగా భోగి పండుగ వేడుక జరుపుకున్నారు.
ఈ సందర్భంగా కంచర్ల మాట్లాడుతూ ఇంటికి చేరిన పంటలతోతమ వ్యవసాయానికి ఆధారమైన గో సంతతి తో కలిసి ప్రకృతి తో మమేకమైకలిసి జరుపుకునే పండుగ సంక్రాంతి అనిభోగి రోజు పాత వస్తువులతో మంటలు వేయడం అంటే మనలోని అహాన్ని భోగి మంటల్లో కాల్చివేసి స్వచ్ఛంగా ఉండటమే ధర్మమని. మన సంస్కృతి, సాంప్రదాయాలను మరువకుండా ముఖ్యంగా యువత పెద్ద ఎత్తున పండుగలు, చేసుకోవాలని ఆకాంక్షించారు.
కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ అధ్యక్షులు రేగట్టే మల్లికార్జున రెడ్డి, మాజీ కౌన్సిలర్ రావుల శ్రీనివాస రెడ్డి, నాగులపల్లి శ్యాంసుందర్, శ్రీపాద కృష్ణమాచారి, చింతపల్లి రాజిరెడ్డి, దేప వినోబరెడ్డి,బండ మధుసూదన్ రెడ్డి, నిరసనమెట్ల నాగార్జున, రేగట్ట మహేందర్ రెడ్డి, కమ్మంపాటి శేఖర్ సిరిగిరి సురేష్ రెడ్డి, బీపంగి కిరణ్, వివేక్ నరసింహ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
MOST READ :
-
UPI : ఫోన్ పే, గూగుల్ పే లకు క్రెడిట్ కార్డు లింక్ చేసి వాడుకోవచ్చు.. ఎలా అంటే..!
-
Ration Cards : రేషన్ కార్డులపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం.. లేటెస్ట్ అప్డేట్..!
-
Gold Price : సంక్రాంతికి మహిళలకు షాక్.. మళ్లీ పెరిగిన గోల్డ్ ధర..!
-
TG News : అందరి ముందే కొట్టుకున్న ఎమ్మెల్యేలు.. వైరల్ అవుతున్న వీడియోలు..!
-
Rythu Bharosa : రైతు భరోసా అర్హతకు రూల్స్ విడుదల.. మీరు అర్హులేనా.. లేటెస్ట్ అప్డేట్..!










