Miryalaguda : పల్లెల రూపురేఖలు మార్చే విధంగా.. మన ఊరు మన ఎమ్మెల్యే..!
Miryalaguda : పల్లెల రూపురేఖలు మార్చే విధంగా.. మన ఊరు మన ఎమ్మెల్యే..!
గడపగడపకు ప్రభుత్వం ప్రవేశపెట్టే పథకాలను తీసుకెళ్లాలి
ప్రతి కార్యకర్తలను కంటి రెప్పలా కాపాడుకుంటా
మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి
వేములపల్లి, మన సాక్షి :
సబ్బండ వర్గాల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి అన్నారు. నియోజకవర్గ అభివృద్ధి లక్ష్యమని పేర్కొన్నారు. బుధవారం మండల కేంద్రంలోని ఆమనగల్ గ్రామంలో శ్రీ పార్వతి రామలింగేశ్వర దేవాలయంలో అర్చకులు రెంటాల సతీష్ శర్మ ఆధ్వర్యంలో అర్చనలు, అభిషేకాలు నిర్వహించారు.
మన ఊరు మన….ఎమ్మెల్యే పోస్టర్ ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ప్రభుత్వం ప్రవేశపెట్టే పథకాలను గడపగడపకు తీసుకుపోయే విధంగా కాంగ్రెస్ కార్యకర్తలు కృషి చేయాలన్నారు. మిర్యాలగూడ నియోజకవర్గంలోని పల్లెలన్నీ రూపురేఖలు మారుస్తానన్నారు.
అనంతరం ఆమనగల్లు, లక్ష్మీదేవిగూడెం గ్రామానికి సంబంధించిన మంజూరైన కల్యాణలక్ష్మి చెక్కులను 15 మంది లబ్ధిదారుల చెక్కులను పంపిణీ చేశారు.సంక్రాంతి తర్వాత అర్హులైన ప్రతి ఒక్కరికి నూతన రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇల్లులు, వ్యవసాయానికి యోగ్యమైన ప్రతి ఎకరానికి 12000,రైతు కూలీలకి 12000 అందిస్తున్నామని అన్నారు.
అంతకుముందు కాంగ్రెస్ శ్రేణులు, మహిళలు కోలాట ప్రదర్శనలతో ఘనంగా స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో డిసిసి అధ్యక్షులు శంకర్ నాయక్, పిసిసి సభ్యులు, చిరుమర్రి కృష్ణయ్య, కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు స్కైలాబ్ నాయక్ , గాయం ఉపేందర్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు మాలికాంతారెడ్డి, పుట్టల కురుపయ్య,
సీఐ వీరబాబు, ఎస్సై వెంకటేశ్వర్లు,ఆర్ఐ స్పందన రెడ్డి,కాంగ్రెస్ పార్టీ నాయకులు వల్లంపట్ల ప్రవీణ్ ,పిల్లల సందీప్, దొంతి రెడ్డి వెంకట్ రెడ్డి, వల్లంపట్ల అబ్రహం, కోలా సైదులు, పెరుమాండ్ల నగేష్, పెరుమాండ్ల కవిరాజు,
జోజి, నార్ల అజయ్, కోల పెద్ద సైదులు, చింతకాయల వీరేందర్, వల్లంపట్ల వెంకన్న, వల్లంపట్ల జాను, కొడిదేల శంకర్, కొల్లి దిలీప్, సలికొలిమిలా బిక్షమాచారి, వాకిటి బిక్షం, ఎల్లయ్య, లొడంగి సైదులు, భయ్యా సైదులు, ముండ్ల గంగయ్య, పేర్ల శంకర్, వంగాల వెంకన్న, గౌరోజు అశోక్, తదితరులు పాల్గొన్నారు.
MOST READ :
-
Railway Jobs : నిరుద్యోగులకు భారీ శుభవార్త.. రైల్వేలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్..!
-
Indiramma Houses : ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు అదిరిపోయే మరో గుడ్ న్యూస్..!
-
Transaction : రూ.20 వేలకు మించి లావాదేవీలు చేస్తే.. ఫైన్ కట్టాల్సిందే.. బిగ్ అలర్ట్..!
-
WhatsApp : మీ వాట్సాప్ కూడా హ్యాక్ చేస్తున్నారా.. ఇది తెలుసుకోండి, లేదంటే ప్రమాదమే..!
-
UPI : ఫోన్ పే, గూగుల్ పే లకు క్రెడిట్ కార్డు లింక్ చేసి వాడుకోవచ్చు.. ఎలా అంటే..!










