Miryalaguda : ఆ దొంగల రూటే సపరేట్.. ఆంధ్రాలో కొట్టేసి.. తెలంగాణలో విక్రయం..!
Miryalaguda : ఆ దొంగల రూటే సపరేట్.. ఆంధ్రాలో కొట్టేసి.. తెలంగాణలో విక్రయం..!
మిర్యాలగూడ, మన సాక్షి :
దొంగతనాలలో కూడా వారి రూటే సపరేటు…. కొత్త వాహనాలని ఎంపిక చేసుకుంటారు.. ఆంధ్ర ప్రాంతంలో కొట్టేస్తారు.. తెలంగాణలో విక్రయిస్తూ దర్జాగా జేబులు నింపుకుంటున్నారు. ఎట్టకేలకు నల్గొండ జిల్లా మిర్యాలగూడ టూ టౌన్ పోలీసులు అంతర్రాష్ట్ర దొంగలకు చెక్ పెట్టి వారి నుండి 5 బైకులను స్వాధీనం చేసుకున్నారు.
గురువారం టూ టౌన్ పోలీస్ స్టేషన్ లో డీఎస్పీ కే.రాజశేఖర్ రాజు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నిందితుల వివరాలను వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ లోని పల్నాడు జిల్లా రెంటచింతల మండలం పాల్వాయి జంక్షన్ కు చెందిన శీలం నాగరాజు అలియాస్ నత్తోడు చిత్తు కాగితాలు ఏరుకునే వృత్తి కొనసాగిస్తున్నాడు. జల్సాలకు అలవాటు పడి బైక్ దొంగతనాలకు తెరలేపాడు.
ఆంధ్రప్రదేశ్ లోని నరసరావుపేట, వినుకొండ , తెలంగాణలోని మిర్యాలగూడ ప్రాంతాలలో పార్కు చేసిన కొత్త బైక్లను దొంగలిస్తున్నాడు. అతని మిత్రుడైన మిర్యాలగూడ ఇందిరమ్మ కాలనీకి చెందిన డీసీఎం డ్రైవర్ మునుకుంట్ల కృష్ణ వద్ద దొంగలించిన బైక్లను ఉంచి తక్కువ ధరకు వాటిని విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు.
గురువారం పట్టణంలోని ఫ్లై ఓవర్ వద్ద పోలీసులు వాహనాలు తనిఖీ చేస్తుండగా, శీలం నాగరాజు బుల్లెట్ బండి పై వస్తుండగా ఆపి పత్రాలు చూపమనడంతో పొంతన లేని సమాధానం చెప్పాడని అనుమానించిన పోలీసులు తమదైన శైలిలో విచారించగా అంతర్రాష్ట్ర బైక్ ల దొంగతనాల వ్యవహారం బయటపడింది.
దీంతో ఇందిరమ్మ కాలనీలోని మునుకుంట్ల కృష్ణ ను అదుపులోకి తీసుకొని అతని వద్ద నాలుగు బైకులు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. పట్టుకున్న బైక్ ల విలువ సుమారు 6 లక్షలు ఉంటుందన్నారు. ఇరువురి పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు డి.ఎస్.పి తెలిపారు.
కేసును చాకచక్యంగా పరిష్కరించిన టు టౌన్ పి. నాగార్జున, డి.హరీష్ రెడ్డి, బి. రాంబాబు, ఏఎస్ఐ పి. వెంకటేశ్వర్లు, పిసి లు పి. బాలకృష్ణ, కే.కళ్యాణ్, హోంగార్డ్ సాయి రెడ్డి లను డిఎస్పి ప్రత్యేకంగా అభినందించారు.
MOST READ :
-
Free Current : దేశవ్యాప్తంగా ప్రతి ఇంటికి 300 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్.. ఈ పథకానికి అప్లై చేసుకోండిలా..!
-
Viral Video : ఒంటినిండా విష సర్పాలు.. మహా కుంభమేళాలో అఘోరీ హల్ ఛల్.. (వీడియో వైరల్)
-
District collector : జిల్లా కలెక్టర్ సంచలన నిర్ణయం.. విధుల పట్ల నిర్లక్ష్యం.. వైద్యాధికారికి షోకాజ్, ముగ్గురు సిబ్బంది సస్పెన్షన్..!
-
Ration Cards : కొత్త రేషన్ కార్డుకు అర్హతలు.. నేటి నుంచి క్షేత్రస్థాయి పరిశీలన..!
-
Railway Jobs : నిరుద్యోగులకు భారీ శుభవార్త.. రైల్వేలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్..!










