District collector : జిల్లా కలెక్టర్ సంచలన నిర్ణయం.. విధుల పట్ల నిర్లక్ష్యం.. వైద్యాధికారికి షోకాజ్, ముగ్గురు సిబ్బంది సస్పెన్షన్..!
District collector : జిల్లా కలెక్టర్ సంచలన నిర్ణయం.. విధుల పట్ల నిర్లక్ష్యం.. వైద్యాధికారికి షోకాజ్, ముగ్గురు సిబ్బంది సస్పెన్షన్..!
పెద్దపల్లి, మన సాక్షి ప్రతినిధి :
పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం బేగంపేట లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో పనిచేసే 3 వైద్య సిబ్బందిని సస్పెండ్ చేస్తూ, 1 వైద్య అధికారికి షోకాజ్ నోటీసులు జారీ చేస్తూ జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష గురువారం ఉత్తర్వులు జారీ చేశారు.
గురువారం ఉదయం 11.45 గంటలకు బేగంపేట లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మిక తనిఖీ నిర్వహించిన జిల్లా కలెక్టర్ సిబ్బంది విధులకు గైర్హజరవడం గమనించారు. బయోమెట్రిక్ అటెండెన్స్ రిజిస్టర్లు పరిశీలించగా ఆ సిబ్బంది అనుమతి లేకుండా చాలా రోజులుగా విధులకు గైర్హాజరు గమనించిన కలెక్టర్ , పలుమార్లు ఆ సిబ్బందికి మెమోలు జారీ చేసినప్పటికీ విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించడాన్ని తీవ్రంగా పరిగణిస్తూ సస్పెండ్ చేశారు.
విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించిన ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నర్సింగ్ స్టాఫ్ ఈ.ఉమా దేవి, హెల్త్ సూపర్వైజర్ కే.పుష్పవతి , ఎం.పీ.హెచ్.ఈ.ఓ ఏ. సీతా రామయ్య ను సస్పెండ్ చేసినట్లు, వైద్య అధికారి డాక్టర్ జె. ప్రదీప్ కుమార్ కు షోకాజ్ నోటీసులు జారీ చేసినట్లు కలెక్టర్ ఆ ప్రకటనలో తెలిపారు.
| MOST READ :
-
Free Current : దేశవ్యాప్తంగా ప్రతి ఇంటికి 300 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్.. ఈ పథకానికి అప్లై చేసుకోండిలా..!
-
Indiramma Bharosa : భూమిలేని వారికి ఏటా రూ.12 వేలు.. మీరూ అర్హులేనా.. నేటి నుంచి క్షేత్రస్థాయి పరిశీలన..!
-
Ration Cards : కొత్త రేషన్ కార్డుకు అర్హతలు.. నేటి నుంచి క్షేత్రస్థాయి పరిశీలన..!
-
Railway Jobs : నిరుద్యోగులకు భారీ శుభవార్త.. రైల్వేలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్..!
-
District collector : జిల్లా కలెక్టర్ సంచలన నిర్ణయం.. కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ తో సహా సిబ్బంది మొత్తం సస్పెన్షన్..!









