Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
TOP STORIESBreaking Newsసంక్షేమంహైదరాబాద్

Indiramma Houses : ఇందిరమ్మ ఇండ్లకు కొత్త నిబంధనలు.. లేటెస్ట్ అప్డేట్..!

Indiramma Houses : ఇందిరమ్మ ఇండ్లకు కొత్త నిబంధనలు.. లేటెస్ట్ అప్డేట్..!

మన సాక్షి, తెలంగాణ బ్యూరో :

తెలంగాణ ప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్ల పథకాన్ని జనవరి 26వ తేదీన ప్రారంభించింది. ప్రతి లబ్ధిదారుడికి నాలుగు విడతల్లో 5 లక్షల రూపాయలను ఇందిరమ్మ ఇంటికి అందజేస్తుంది. అయితే ప్రజా పాలన ద్వారా దరఖాస్తులు చేసుకున్న వారి వీళ్ళకు అధికారులు వెళ్లి పరిశీలన చేశారు. అర్హుల జాబితాను సైతం ఎంపిక చేశారు.

ఇలా ఉండగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతి మండలానికి ఒక గ్రామాన్ని ఎంపిక చేసి ఆ గ్రామాలను ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని ప్రారంభించారు. ఆ గ్రామంలో లబ్ధిదారులను ప్రభుత్వం గుర్తించింది. అయితే ఆ లబ్ధిదారుల ఇండ్ల స్థలాలను అధికారులు పరిశీలించే పరిశీలించనున్నారు. లబ్ధిదారుల ఇండ్లకు వెళ్లి ఇల్లు ఎలా నిర్మించాలో.. అధికారులు సూచనలు చేయనున్నారు.

ప్రభుత్వం ముందుగా 71,482 ఇండ్లను మంజూరు చేసింది. వారికే డబ్బులు ఇవ్వనున్నది. ప్రతి నియోజకవర్గానికి ఏడాదికి 3500 ఇండ్ల చొప్పున మంజూరు చేయనున్నది. కాగా ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు ప్రభుత్వం కొత్త నిబంధనలను తీసుకొచ్చింది.

అవేంటో చూద్దాం…

  • ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల సర్వే సందర్భంలో యాప్ లో నమోదైన స్థలంలో మాత్రమే ఇల్లు కట్టుకోవాలి. వేరే చోట కట్టుకుంటామంటే ఇంటిని రద్దు చేస్తారు.

  • కనీసం 400 చదరపు అడుగుల స్థలంలో ఇల్లు నిర్మించుకోవాలి.

  • ఇంటి స్థలంలో ఇంటి నిర్మాణానికి గాను ముగ్గు అతడే పోసుకోవాలి. ఆ తర్వాత గ్రామ కార్యదర్శికి సమాచారం ఇస్తే ఫోటోలు యాప్ లో అప్లోడ్ చేస్తారు. ఆ తర్వాత జియో టాకింగ్ చేస్తారు.

  • దానివల్ల భూమి మ్యాప్ లో ఫిక్స్ అవుతుంది. ఎక్కడి నుంచైనా ఆ స్థలాన్ని కనిపెట్టవచ్చును.

  • పునాదులు తీసుకోవాలి ఆ సమయంలో ప్రభుత్వం సహాయం చేయదు. పునాదులు పూర్తయ్యాక సంబంధిత అధికారులకు తెలియజేస్తే వారు యాప్ లో అప్లోడ్ చేసి ఒక లక్ష రూపాయలు అకౌంట్ లో జమ చేస్తారు.

  • ఒక ఇంటిని నిర్మించడానికి ఎనిమిది ట్రాక్టర్ల ఇసుక అందజేస్తుంది. ఇసుక కూపన్లు సంబంధిత తాసిల్దార్ ఇస్తారు.

  • స్టీల్ సామాగ్రి, సిమెంటు, ఇతర ఇంటికి అవసరమైన సామాగ్రిని హౌసింగ్ కార్పొరేషన్ మార్కెట్ కంటే తక్కువ ధరకు అందజేస్తుంది.

  • ఇంటి పునాదులు సగం వరకు గోడలు, కిటికీలు తలుపులు పూర్తయ్యాక అధికారులు పరిశీలించి రెండో దశ డబ్బులు ఎకౌంట్లో వేస్తారు.

  • ఈ పథకం పక్కదారి పట్టకుండా ఎప్పటికప్పుడు అధికారులు పర్యవేక్షణ జరుగుతుంది.

■ ఇవి కూడా చదవండి : 

  1. Gold Price : బంగారం ఆల్ టైం రికార్డ్.. తెలుగు రాష్ట్రాల్లో ధర ఎంతంటే..!

  2. Nalgonda : నల్గొండ జిల్లాలో భారీ చోరీ.. ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో 23 లక్షల బ్యాగు మాయం..!

  3. Rythu Bharosa : రైతు భరోసా మళ్లీ ఎప్పుడంటే.. డేట్ ఫిక్స్.. బిగ్ అప్డేట్..!

  4. Ration Cards : కొత్త రేషన్ కార్డుల దరఖాస్తుల పై స్పష్టం.. లేటెస్ట్ అప్డేట్..!

  5. Velpugonda : నేటి నుంచి వేల్పుగొండలో శ్రీ తుంబురేశ్వర స్వామి ఉత్సవాలు..!

మరిన్ని వార్తలు