Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsజిల్లా వార్తలుతెలంగాణనల్గొండవ్యవసాయం

Miryalaguda : యూరియా నిల్వలు తనిఖీ చేసిన జిల్లా వ్యవసాయ అధికారి.. రైతులకు కీలక సూచన..!

Miryalaguda : యూరియా నిల్వలు తనిఖీ చేసిన జిల్లా వ్యవసాయ అధికారి.. రైతులకు కీలక సూచన..!

మిర్యాలగూడ, మనసాక్షి:

నల్గొండ జిల్లా మిర్యాలగూడ మండలంలోని శ్రీనివాస్ నగర్ లోని ఎన్ డి సి ఎం ఎస్, కేకే ట్రేడర్స్ ఎరువుల దుకాణాలను జిల్లా వ్యవసాయ అధికారి పి శ్రవణ్ కుమార్ సందర్శించడం జరిగింది. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ నల్లగొండ జిల్లాలోని అన్ని ప్రాథమిక వ్యవసాయ సహకార కేంద్రము మరియు ఎన్ డి సి ఎం ఎస్ లలో తగినంత యూరియా నిల్వలు ఉన్నాయని, సోమవారము మంగళవారములలో 2 రాక్స్ ఇంకా ఈనెలలో మరో పదివేల మెట్రిక్ టన్నుల యూరియా రానున్నదని చెప్పారు.

సిఫారసు మేరకు యూరియా వాడుకోవాలని సూచించారు. అధిక యూరియా వాడినట్లయితే పంట పొలాలలో చీడపీడలు అధికమై అగ్గి తెగులు కాండంతో పురుగులు అధికంగా వచ్చి పంట పొలాలు దిగుబడి తగ్గే అవకాశం ఉందని సూచించారు. రైతులు సిఫారసు మేరకు ఎరువులు వాడుకోవాలని పురుగు మందుల విషయంలో వ్యవసాయ అధికారుల సూచనలు పాటించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి దీరావత్ సైదా నాయక్, రైతులు శేఖర్ రెడ్డి, హరిబాబు, శ్రీనివాస్ రెడ్డి పాల్గొన్నారు.

MOST READ : 

  1. Gold Price : మళ్లీ పెరిగిన బంగారం ధర.. ఈరోజు తెలుగు రాష్ట్రాల్లో ఎంతంటే..!

  2. Rythu Bharosa : రైతు భరోసా దరఖాస్తు చేసుకున్నారా.. వ్యవసాయ శాఖ గుడ్ న్యూస్.. లేటెస్ట్ అప్డేట్..!

  3. Rythu : ఆర్ధిక ఇబ్బందులతో రైతు మృతి..!

  4. Hyderabad : మైక్రోసాఫ్ట్ విస్తరణ.. నూతన క్యాంపస్ ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి..!

మరిన్ని వార్తలు