Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsక్రైంఖమ్మం జిల్లాజిల్లా వార్తలుతెలంగాణ

Rythu : ఆర్ధిక ఇబ్బందులతో రైతు మృతి..!

Rythu : ఆర్ధిక ఇబ్బందులతో రైతు మృతి..!

నేలకొండపల్లి, మన సాక్షి :

అందినకాడికల్లా అప్పులు తెచ్చి…వ్యవసాయం తో పాటు చెరువు లో చేపల పెంపకం సాగు కు వినియోగించాడు. ఇటు వ్యవసాయం…. చేపల పెంపకం కలిసిరాకపోవటంతో అప్పుల పాలైయ్యాడు… అప్పులు.. ఆర్ధిక ఇబ్బందులను తట్టుకోలేక పురుగుల మందు తాగి.. ఆత్మహత్యాయత్నం కు పాల్పడ్డాడు. చికిత్స పొందుతూ మృతి చెందిన ఘటన చోటు చేసుకుంది. మృతుడు భార్య కధనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి.

ఖమ్మం జిల్లా, నేలకొండపల్లి మండలం లోని మంగాపురంతండా(చిన్నతండా) కు చెందిన తేజావత్ రాము ( 47) అనేరైతు తనకున్న నాలుగున్నర ఎకరాల పొలం సాగు చేశాడు. అంతే కాకుండా ఓ చెరువు ను లీజ్ కు తీసుకుని చేపల పెంపకం కోసం అందినకాడికల్లా అప్పులు చేశాడు.

ఇటు వ్యవసాయం..అటు చేపల పెంపకం లో కలిసి రాకపోవటంతో అప్పులు పాలైయ్యాడు. దాదాపు రూ.2.90 కోట్ల వరకు అప్పులు కాగా దాదాపు రూ.2 కోట్ల అప్పులు తీర్చాడు. ఇంకా రూ.90 లక్షల వరకు అప్పులు ఉన్నాయి. అప్పులు తీర్చే మార్గం కనిపించకపోవటంతో ఈ నెల 7 వ తేదిన తన పొలంలో పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్న కు పాల్పడ్డాడు.

సమాచారం అందుకున్న కుటుంబ సభ్యులు ఖమ్మం లోని ఓ ప్రవేట్ హస్పిటల్ లో చికిత్స పొందుతున్నారు. శుక్రవారం తెల్లవారు జామున మృతి చెందాడు. మృతుడు కు భార్య, ఇరువురు కుమారులు ఉన్నారు. కుటుంబ సభ్యులు బోరున విలపించారు. మృతుడు భార్య శరణ ఫిర్యాదు మేరకు స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

మృతదేహం కు నేలకొండపల్లి ప్రభుత్వ హస్పిటల్ లో పోస్టుమార్టమ్ ను నిర్వహించారు. మృతదేహం ను చేపల మత్యపారిశ్రామిక సహాకార సంఘం ఉపాధ్యాక్షుడు ధీరావత్ రాధాకృష్ణమూర్తి తదితరులు సందర్శించి నివాళులు అర్పించారు. కుటుంబ సభ్యులకు ప్రగాడ సానుభూతిని తెలియజేశారు.

MOST READ : 

  1. Khammam : ఖమ్మం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మృతి, 8మందికి తీవ్ర గాయాలు..!

  2. Gold Price : మళ్లీ పెరిగిన బంగారం ధర.. ఈరోజు తెలుగు రాష్ట్రాల్లో ఎంతంటే..!

  3. Rythu Bharosa : రైతు భరోసా దరఖాస్తు చేసుకున్నారా.. వ్యవసాయ శాఖ గుడ్ న్యూస్.. లేటెస్ట్ అప్డేట్..!

  4. Hyderabad : మైక్రోసాఫ్ట్ విస్తరణ.. నూతన క్యాంపస్ ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి..!

మరిన్ని వార్తలు