Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
తెలంగాణBreaking Newsజిల్లా వార్తలునల్గొండవిద్య

Miryalaguda : విద్యార్థులే ఉపాధ్యాయులైన వేళ..!

Miryalaguda : విద్యార్థులే ఉపాధ్యాయులైన వేళ..!

మిర్యాలగూడ, మన సాక్షి :

నల్గొండ జిల్లా మిర్యాలగూడ పట్టణంలోని వాసవి నగర్ నందు గల ఎస్ వి మోడల్ హై స్కూల్ లో స్వపరిపాలన దినోత్సవం ఘనంగా నిర్వహించడం జరిగింది. విద్యార్థులు ఉపాధ్యాయులుగా, అధికారులుగా, ప్రజాప్రతినిధులుగా వ్యవహరించారు.

ఈ కార్యక్రమంలో ప్రైమ్ మినిస్టర్ గా ఓరుగంటి విధు చంద్రకుమార్ , సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఓరుగంటి పార్ధు శశాంక్ కుమార్, కేంద్ర హోం శాఖ మంత్రిగా నవ్య రెడ్డి, కేంద్ర విద్యా శాఖ మంత్రిగా శ్రీలేఖ, సెంట్రల్ హెల్త్ మినిస్టర్ గా శ్రావణి, ఫైనాన్స్ మినిస్టర్ నందిని,

స్టేట్ హెల్త్ మినిస్టర్ గా మాధురి, డిఫెన్స్ మినిస్టర్ గా హారిక అంజలి, ఎంపి గా నిఖిల్, చీఫ్ మినిస్టర్ గా సాయి చరణ్, జాయింట్ కలెక్టర్ గా శృతి, కలెక్టర్ గా ఝాన్సీ, డి ఈ వో గా భవాని, డిప్యూటీ డి ఈ వో గా సౌమ్య, ఎమ్మెల్యేగా కౌశల్, ఎండిఓ అక్షర, ఏంఆర్వో లిఖిత, ఆర్జెడిగా అలేఖ్య, ఎంఈఓ గా జయలక్ష్మి, కరస్పాండెంట్ అక్షిత్, ప్రిన్సిపల్ గా చంద్రశేఖర్,

జనని ఇన్చార్జిగా సుమయ్య, నందిని , గగన రిషిక, , రక్షిత తదితరులు ఉపాధ్యాయులుగా , పీఈటీలుగా, పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో దాదాపు 250 మంది విద్యార్థులు పాల్గొన్నారు. పాల్గొన్న ప్రతి విద్యార్థికి బహుమతి ప్రధానం చేయడం జరిగింది.

ఈ కార్యక్రమంలో పాఠశాల కరస్పాండెంట్ ఓరుగంటి శ్యాంసుందర్ మాట్లాడుతూ ఇలాంటి కార్యక్రమాల ద్వారా విద్యార్థులకు ఆత్మస్థైర్యాన్ని పెంపొందించవచ్చు అని, నైతిక విలువలు విద్యార్థులు తెలుసుకోవచ్చని, ఉపాధ్యాయ వృత్తి ఎంతో విలువ అయినదని అందరు తెలుసుకోవచ్చని తెలిపారు. కార్యక్రమంలో పాఠశాల కరస్పాండెంట్ ఓరుగంటి శ్యాంసుందర్ తో పాటు డైరెక్టర్ ఓరుగంటి విశాలాక్ష్మి, ఇంచార్జ్ నాగలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

MOST READ : 

  1. Gold Price : భారీగా తగ్గిన బంగారం ధర.. ఇదే కొనుగోలుకు అదును..!

  2. Miryalaguda : యూరియా నిల్వలు తనిఖీ చేసిన జిల్లా వ్యవసాయ అధికారి.. రైతులకు కీలక సూచన..!

  3. Suryapet : పెద్దగట్టు జాతరకు 60 ప్రత్యేక బస్సులు.. ఆర్టీసీ ఆర్ఎం జాన్ రెడ్డి..!

  4. Rythu Bharosa : రైతు భరోసా దరఖాస్తు చేసుకున్నారా.. వ్యవసాయ శాఖ గుడ్ న్యూస్.. లేటెస్ట్ అప్డేట్..!

మరిన్ని వార్తలు