District collector : గురుకుల పాఠశాల విద్యార్థులతో జిల్లా కలెక్టర్ ముఖాముఖి.. కీలక సూచన..!
District collector : గురుకుల పాఠశాల విద్యార్థులతో జిల్లా కలెక్టర్ ముఖాముఖి.. కీలక సూచన..!
నల్లగొండ, మన సాక్షి :
సమాజంలో ఉన్నతమైన స్థానంలో ఉన్న వారిని ఆదర్శంగా తీసుకుని కష్టపడి చదివి సమాజానికి, తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి విద్యార్థులకు సూచించారు. శనివారం ఆమె నల్గొండ జిల్లా కేంద్రం సమీపంలో ఉన్న అల్పసంఖ్యాక వర్గాల బాలికల రెసిడెన్షియల్ కళాశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు.
పదవ తరగతి గదిలోకి వెళ్లి విద్యార్థినులతో ముఖాముఖి మాట్లాడి వారి విషయ పరిజ్ఞానాన్ని పరీక్షించారు.డిస్కోర్స్ అంటే ఏంటి?అని ప్రశ్నించారు.ఇది గ్రామర్ లో ఒక భాగమని, డిస్కస్ అనే పదం ద్వారా డిస్కోర్స్ అనేది వచ్చిందని, అంశాల పై చర్చను డిస్కోర్స్ అంటారని తెలిపారు. విద్యార్థినులు మంచి పరిజ్ఞానాన్ని సంపాదించేందుకు పుస్తకాలను ,వార్తా పత్రికలను బాగా చదవాలని ,ప్రత్యేకించి సంపాదకీయాలను చదవాలని ఆమె సూచించారు.
అలాగే రోమిల్లా థాపర్, ఇందిరాగాంధీ వంటి మంచి ఉన్నతమైన వ్యక్తులు, ఆశయాలు కలిగిన వారిని ఆదర్శంగా తీసుకొని ఒక లక్ష్యాన్ని ఏర్పాటు చేసుకొని ఆ లక్ష్యసాధనకు కృషి చేయాలని అన్నారు. బాగా చదవడం ద్వారా తల్లిదండ్రులకు, గురువులకు మంచి పేరు తీసుకురావాలని ,కుటుంబానికి చేయూతగా ఉండాలని అన్నారు.ఈ సందర్భంగా ఆమె జర్నలిజం, క్రోమోజోమ్స్ , తదితర అంశాల పై విద్యార్థినిలకు అవగాహన కల్పించారు.
అనంతరం కళాశాల వంటగదిని, డైనింగ్, పరిసరాలను పరిశీలించి వంటగది ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉండేలా చూసుకోవాలని, అపరిశుభ్రత కారణంగా ఏ ఒక్క విద్యార్థిని ఆసుపత్రి పాలు కాకుండా చూడాలని, బర్ద్ ఫ్లూ కారణంగా చికెన్ వాడవద్దని ప్రిన్సిపల్ ను ఆదేశించారు. కాగా హాస్టల్ కు గ్యాస్ స్టవ్ లు కావాలని ప్రిన్సిపాల్ కోరగా అందుకు జిల్లా కలెక్టర్ అంగీకరించారు. ప్రిన్సిపల్ షాహిన్ షేక్, ఉపాధ్యాయినిలు ఉన్నారు.
MOST READ :
-
Mega Job Mela : గందరగోళంగా మెగా జాబ్ మేళా.. వేలాదిగా తరలివచ్చిన నిరుద్యోగులు..!
-
BIG BREAKING : నేటి కొత్త రేషన్ కార్డుల పంపిణీకి బ్రేక్.. ఎందుకంటే..!
-
Gold Price : వరుసగా నాలుగో రోజు కుప్పకూలిన బంగారం ధర.. ఇదే మంచి తరుణం..!
-
Rythu Bharosa : రైతు భరోసా పై డిప్యూటీ సీఎం భట్టి కీలక ఆదేశాలు.. లేటెస్ట్ అప్డేట్..!
-
Rythu Bharosa : ఏదీ రైతు భరోసా.. ఆర్థిక శాఖ పక్కన పెట్టిందా.. లేటెస్ట్ అప్డేట్..!









