తెలంగాణBreaking Newsజిల్లా వార్తలునల్గొండ

Nalgonda : రేపే ఎమ్మెల్సీ ఎన్నికల లెక్కింపు.. అభ్యర్థులు, ఏజెంట్లతో జిల్లా కలెక్టర్ సమావేశం..!

Nalgonda : రేపే ఎమ్మెల్సీ ఎన్నికల లెక్కింపు.. అభ్యర్థులు, ఏజెంట్లతో జిల్లా కలెక్టర్ సమావేశం..!

నల్లగొండ, మన సాక్షి :

వరంగల్- ఖమ్మం -నల్గొండ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు సోమవారం చేపట్టనున్నారు. అందుకు సంబంధించిన ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఎన్నికల ఓట్ల లెక్కింపు సవ్యంగా నిర్వహించేందుకు పోటీలో ఉన్న అభ్యర్థులు, రాజకీయ పార్టీలు పూర్తి సహకారం అందించాలని జిల్లా కలెక్టర్, వరంగల్- ఖమ్మం- నల్గొండ ఉపాధ్యాయ ఎం ఎల్ సి ఎన్నికల రిటర్నింగ్ అధికారి ఇలా త్రిపాఠి కోరారు.

శనివారం ఆమె ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీలో ఉన్న అభ్యర్థులతో తన చాంబర్లో సమావేశమై కౌంటింగ్ ప్రక్రియ, ఓట్ల లెక్కింపు విధానం, తదితర అంశాలపై తెలియజేశారు. ఓట్ల లెక్కింపు సందర్భంగా ఏర్పాటు చేయనున్న టేబుళ్లు, చెల్లుబాటు అయ్యే ఓట్లు, కానీ ఓట్ల గుర్తింపు, తదితర అంశాలపై క్షుణ్ణంగా తెలియజేశారు.

ఎమ్మెల్సీ ఎన్నికల సాధారణ పరిశీలకుల సమక్షంలో ఓట్ల లెక్కింపును నిర్వహించడం జరుగుతుందని, ఓట్ల లెక్కింపు కార్యక్రమం సజావుగా జరిగేందుకు పూర్తి సహాయ సహకారాలు అందించాలని ఆమె విజ్ఞప్తి చేశారు. అదనపు కలెక్టర్, వరంగల్ -ఖమ్మం- నల్గొండ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల ఏ ఆర్ ఓ జె. శ్రీనివాస్, అభ్యర్థులు, వారి ఏజెంట్లు ఈ సమావేశానికి హాజరయ్యారు.

MOST READ : 

  1. UPI : ఫోన్ పే, గూగుల్ పే లో నేటి నుంచి యూపీఐ కొత్త రూల్స్.. మీ ఖాతాలలో డబ్బులు బ్లాక్..!

  2. Gold Price : వరుసగా నాలుగో రోజు కుప్పకూలిన బంగారం ధర.. ఇదే మంచి తరుణం..!

  3. Rythu : కౌలు రైతుకు భారీ గుడ్ న్యూస్.. ఏడాదికి రూ 20,000..!

  4. Suryapet : కంట నీరు పెట్టుకున్న మాజీమంత్రి జగదీష్ రెడ్డి..! 

  5. Rythu Bharosa : రైతు భరోసా పై డిప్యూటీ సీఎం భట్టి కీలక ఆదేశాలు.. లేటెస్ట్ అప్డేట్..!

మరిన్ని వార్తలు