Peddapalli : జిల్లా వైద్యాధికారి సంచలన నిర్ణయం.. ప్రైవేట్ ఆసుపత్రి సీజ్..!
Peddapalli : జిల్లా వైద్యాధికారి సంచలన నిర్ణయం.. ప్రైవేట్ ఆసుపత్రి సీజ్..!
ధర్మారం, మన సాక్షి :
పెద్దపల్లి జిల్లా ధర్మారం మండల కేంద్రంలోని ప్రముఖ ఆసుపత్రి అయినా సూర్య ఆదిత్య ఆసుపత్రి యాజమాన్యం రోగుల పట్ల నిర్వహిస్తున్న నిర్లక్ష్య వైఖరి పట్ల జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష దృష్టికి సమాచారం రాగా డి ఎం ఎచ్ ఓ అన్నప్రాసన్న కి అత్యవసర తనిఖీలు నిర్వహించాలని ఆదేశాలు జారీ చేయగా సోమవారం ఆకస్మికంగా తనిఖీ నిర్వహించారు. ల్యాబ్ లో నిర్వహిస్తున్న స్కానింగ్ రూమ్ తో పాటు ఆపరేషన్ థియేటర్, పేషంట్స్ వివరాలను పొందుపరిచే కె షిట్ లను తనిఖీ చేశారు.
కాగా స్కానింగ్ రూమ్ లో హార్డ్ డిస్క్ లేదని విచ్చలవిడిగా స్కానింగ్ లు చేస్తూ ప్రజల ప్రాణాలతో చాలగటం ఆడుతున్నారని గ్రహించి ఉన్నత అధికారుల మేరకు హాస్పిటల్ ని సిజ్ చేశారు. ఇప్పటికే గత 15రోజుల క్రితం నోటీసు జారీ చేసినప్పటికి యాజమాన్యం వైఖరి మారకపోవడంతో సోమవారం కలెక్టర్ కోయ శ్రీహర్ష ఆదేశాల మేరకు డి ఎం ఎచ్ ఓ అన్నప్రాసన్న ఆకస్మిక తనిఖీ చేయవలసి వచ్చిందని పేర్కొన్నారు.
మత్తు డాక్టర్ తో పాటు సరైన డాక్టర్స్ ఆసుపత్రిలో లేరని గుర్తించడం జరిగిందని అన్నారు. పరిమితికి మించి ఆసుపత్రిలో మందులను వాడుతున్నారని గుర్తించడం జరిగిందని తెలిపారు. జిల్లాలోని ప్రైవేట్ ఆసుపత్రిలో ఎప్పటికప్పుడు తనిఖీలు నిర్వహిస్తున్నామని నియమ నిబంధనలను అతిక్రమిస్తే ప్రైవేటు ఆసుపత్రులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
MOST READ :
-
Suryapet : సూర్యాపేట జిల్లాలో అధికారుల నిర్వాకం.. బతికుండగానే అధికారులే చంపేశారు..!
-
Forgery : పంచాయతీ కార్యదర్శి సంతకం ఫోర్జరీ.. నలుగురి రిమాండ్..!
-
PhonePe Free Gas : ఫోన్ పే వాడేవారికి గుడ్ న్యూస్.. ఉచిత గ్యాస్ సిలిండర్ ఇలా పొందండి..!
-
Miryalaguda : గ్రూప్ -2, గ్రూప్ -3 లో మహిళా టాపర్.. వినీషారెడ్డి..!
-
UPI : గూగుల్ పే, ఫోన్ పే బిగ్ షాక్.. లావాదేవీలు ఇక పిరం..!









