Nalgonda : DRDA ఏపిడి సంచలన నిర్ణయం.. ఓపెన్ ఫోరంలో ఐదుగురికి షోకజ్..!
Nalgonda : DRDA ఏపిడి సంచలన నిర్ణయం.. ఓపెన్ ఫోరంలో ఐదుగురికి షోకజ్..!
కనగల్, మన సాక్షి :
నల్గొండ జిల్లా కనగల్ మండలంలో నిర్వహించిన మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పనులపై నిర్వహించిన ఓపెన్ ఫోరంలో ఐదుగురికి షోకాజ్ నోటీసులు ఇచ్చారు. మండల పరిధిలో నిర్వహించిన ఎన్ఆర్ఈజీఎస్ పనులపై బుధవారం మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయ ఆవరణలో ఓపెన్ ఫోరం నిర్వహించారు.
మండలంలో మొత్తం12, 691 ఉపాధి హామీ జాబు కార్డులు ఉండగా అందులో 27, 907 మంది కూలీలు ఉన్నారు. ఇందులో సగటున 7000 మంది కూలీలు పనిచేశారు. కూలీల వేతనాల కొరకు మొత్తం రూ. 3,48,82,228 కోట్లు కూలీలకు కూలి డబ్బులు ప్రభుత్వం చెల్లించింది.
అదేవిధంగా రూ. 15,60,011 లక్షలు మెటీరియల్ పేమెంట్ చేయగా మొత్తంగా రూ. 3,64,42,239 కోట్లు ఖర్చు చేశారు. ఇవిగాక ఎన్ఆర్ఈజీఎస్ నిధులతోనే పలు గ్రామాలలో పంచాయతీరాజ్ శాఖ పర్యవేక్షణలో రూ. 3,27,02,403 కోట్లతో సీసీ రోడ్ల నిర్మాణం పనులు చేపట్టారు.
ఉపాధి హామీ పనుల్లో భాగంగా కాలువల మరమ్మతులు, ఫీడర్ చానల్స్ అభివృద్ధి, పామ్ పౌండ్స్ నిర్మాణం, రైతులు పొలాల్లోకి వెళ్ళేందుకు రోడ్ల నిర్మాణం తదితర పనులు చేపట్టారు. ప్రధానంగా ఆయా గ్రామాల్లో నిర్వహించిన గ్రామసభల్లో ఉపాధి హామీ పనులను స్థానిక పంచాయతీ కార్యదర్శి తనిఖీ చేయాలని వెల్లడయింది.
ఓపెన్ ఫోరంలో ఐదుగురు టీఏలు ఎఫ్ఎ లకు షోకాజ్ నోటీసులు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో డిఆర్డిఏ ఏపీడి నవీన్ కుమార్, విజిలెన్స్ అధికారి చకిలం వేణుగోపాలరావు, అంబుడ్స్ మెన్ గౌరీ, ఎంపీడీవో జయరాం, ఎం పి ఓ సుమలత, ఏపీవో సుధాకర్, ఈసీ రమేష్, ఆయా గ్రామాల పంచాయతీ కార్యదర్శులు, టిఏలు, ఎఫ్ఏలు తదితరులు పాల్గొన్నారు.
MOST READ :
-
Cyber : సైబర్ మోసగాడికే చుక్కలు చూపించిన యువకుడు.. ఎలాగో అందరూ తెలుసుకోండి..!
-
Telangana Budget 2025 : తెలంగాణ బడ్జెట్ లో సామాన్యులకు భారీ గుడ్ న్యూస్..!
-
Nalgonda : జిల్లా ఎస్పీ కీలక నిర్ణయం.. గ్రామానికో పోలీస్ అధికారి, రేపటి నుంచే అమలు..!
-
District collector : మఖాన సాగు పై రైతులు దృష్టి సారించాలి.. వ్యవసాయ శాస్త్రవేత్తలు పవర్ పాయింట్ ప్రజెంటేషన్..!
-
TG News : నిరుద్యోగ యువతకు అదిరిపోయే పథకం.. రూ.3 లక్షల సహాయం.. నేటి నుంచే..!









